APPSC: ఏపీపీఎస్సీ ప్రక్షాళన-జాబ్ క్యాలెండర్-నోటిఫికేషన్లు ఇలా-కీలక ప్రతిపాదనలు..!

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు భరోసా ఇచ్చేలా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో అంతర్గతంగా ఏపీపీఎస్సీలో చేయాల్సిన మార్పులతో పాటు ఛైర్మన్, సభ్యుల ఎంపిక, ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో నోటిఫికేషన్ల జారీ, ఉద్యోగ కేటగిరీల విభజన ఇలా పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

APPSC new proposals to government to fill vacancies recruitments as per job calendar

ఏపీపీఎస్సీ ప్రక్షాళన కోసం గతేడాది వైసీపీ ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన 10 మంది నిపుణులైన అధికారులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ తమ ప్రతిపాదనలను ఇప్పుడు కూటమి సర్కార్ కు అందజేయబోతోంది. ఇందులో ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్-ఏ,బీ, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ కింద విభజిస్తారు. అలాగే ఓసారి కేబినెట్ ఆమోదించిన ఉద్యోగాల భర్తీకి ఆర్ధిఖ శాఖ అనుమతి తప్పనిసరి అన్న నిబంధన తొలగిస్తారు.

జాబ్ క్యాలెండర్ ద్వారా మాత్రమే ఉద్యోగాల భర్తీ చేస్తారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీకి అందుతాయి. వీటిని డైరెక్ట్, క్యారీ ఫార్వార్డ్, ఆన్ ఫీల్డ్ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. ఇలా ప్రతీ శాఖ ఖాళీల వివరాలు ప్రతీ ఏటా మార్చి 1 నుంచి ఏప్రిల్ 30లోగా ప్రభుత్వానికి పంపాలి. వారు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదిస్తారు. అప్పుడు వీటి భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటుంది.

అలాగే ఇతర రాష్ట్రాల్లో మంచి విధానాలను ఇక్కడా అమలు చేయబోతున్నారు.ఇందులో రాజస్థాన్ తరహాలో ఆన్ లైన్ పరీక్షలకు అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ పై కనిపించేలా పెడతారు. ఏపీపీఎస్సీలో ఐటీ విభాగాన్ని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాకుండా అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తారు. అభ్యర్ధులు పరీక్షలకు చెల్లించే ఫీజులు ప్రభుత్వానికి కాకుండా కమిషన్ కు వెళ్లేలా చేయాలని ప్రతిపాదిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో సెర్చ్ కమిటీ ద్వారానే ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల ఎంపిక చేపట్టాలి. ఈ ప్రతిపాదనలు త్వరలో ప్రభుత్వానికి చేరనున్నాయి. వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+