Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APPSC Group 2 Hall Tickets: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్ల విడుదలకు సిద్ధం ?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 899 పోస్టుల్ని ఈసారి భర్తీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హాల్ టికెట్ల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

APPSC to release Group 2 exam Hall Tickets tomorrow- here is how to download

ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గత డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి హాల్ టికెట్లను బోర్డు రేపు విడుదల చేయబోతోంది.ఈ మేరకు ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. హాల్ టికెట్లు విడుదల అయ్యాక అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ( జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఈసారి ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో 899 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఇందులో 846 రెగ్యులర్ ఖాళీలతో పాటు మరో 53 క్యారీ ఫార్వార్డ్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే అప్లికేషన్ల స్వీకరణ కూడా పూర్తయింది. దీంతో పరీక్షలకు అభ్యర్ధులు సన్నద్ధమవుతున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+