Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSRTC: సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ అదిరిపోయే న్యూస్..!

ఈసారి సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి రావాలనుకునే వారి రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఎప్పటిలాగే స్పెషల్ బస్సుల్ని నడపాలని నిర్ణయించింది. ఈసారి సంక్రాంతి సీజన్ లో ఏకంగా 2400 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అలాగే వీటిలో ప్రత్యేక ఛార్జీలపైనా స్పష్టత ఇచ్చేశారు.

హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి సీజన్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈసారి 2400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, వైజాగ్ తో పాటు ఏపీలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు ప్రత్యేక సర్వీసుల్ని కేటాయించారు. వీటి లక్ష్యం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు రావాలనుకునే వారికి వెసులుబాటు ఇవ్వడమే. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది

apsrtc to run 2400 special buses from Hyderabad to meet Sankranti festival rush

అలాగే ఈసారి ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీల భారం కూడా ఉండబోదని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. గతంలో పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీల మోత ఉండేది. కానీ కొంతకాలంగా ఆర్టీసీ ఇలా పండుగల రద్దీని అడ్డుపెట్టుకుని అదనపు ఛార్జీలు వసూలు చేసే విధానానికి చెక్ పెట్టింది. ఈసారి కూడా సంక్రాంతికి అదనపు ఛార్జీలు లేకుండానే రెగ్యులర్ బస్సుల తరహాలోనే ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+