Job Mela: మంగళగిరిలో లోకేష్ మెగా జాబ్ మేళా..! డేట్, టైమ్, ఉద్యోగాలు, జీతాలివే..!
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చేందుకు ఇతర హామీలతో పాటు 20 లక్షల ఉద్యోగాల హామీ కూడా ఇచ్చిన కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చాక దీనిపై సీరియస్ గా దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు కొత్త పరిశ్రమల్ని తీసుకురావడంతో పాటు అవకాశం ఉన్న చోట్ల జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో త్వరలో ఓ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మంగళగిరిలోని విటిజేఎం -ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ నెల 22 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మెగా జాబ్‌మేళా జరగనుంది. ఇందులో వివిధ రకాల ప్రైవేటు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో ఐటీసీ, టాటా, ఫాక్స్ కాన్, రేమండ్స్, ర్యాపిడో సహా మొత్తం 10 కంపెనీలు పాల్గొంటున్నాయి. వీటిలో మెషీన్ ఆపరేటర్, మెయింటెయినర్, జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, టికెట్ కౌంటర్ రైడ్ ఆపరేటర్, కస్టమర్ సపోర్ట్, టీమ్ లీడర్, జూనియర్ ఛెఫ్, హెచ్ ఆర్ ట్రెయినీ, డెలివరీ పార్ట్ నర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయ. వీటికి నెలకు కనీసం 14 వేల నుంచి 75 వేల వరకూ జీత భత్యాలు ఉన్నాయి. దాదాపు 2200 ఉద్యోగాల వరకూ ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకూ వయస్సు ఉన్న నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

ఈ మెగా జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ లింక్ https://naipunyam.ap.gov.in/user-registration
కూడా అందుబాటులో ఉంచారు. అలాగే జాబ్ మేళాకు సంబంధించి ఇతర వివరాల కోసం పి.శ్రావణి (9347372996) లేదా ఎస్.కె.బాజీ (7780588993) నంబర్లను అందుబాటులోఉంచారు. అలాగే నేరుగా 9988853335 నంబర్ కు కూడా కాల్ చేసి వివరాలు పొందవచ్చు.












Click it and Unblock the Notifications