Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో డిసెంబరు 29నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: జగన్ సర్కార్ కు అల్టిమేటం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే, మరోవైపు ఏపీ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీలు, విలేజ్ వాలంటీర్లు ప్రభుత్వంపై తమ డిమాండ్ల సాధనకు యుద్ధం ప్రకటిస్తే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబరు 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది.

ఆరోగ్యశ్రీ చికిత్సల ఫీజుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతోపాటు, పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచక పోవడం పట్ల అందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లుగా ఫీజుల చెల్లింపుల్లో జాప్యంపై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, బకాయిల విడుదలపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గతంలో ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేశామని పేర్కొంది.

Arogyasri services to be stopped in AP from December 29: ultimatum to jagan government

చికిత్సలకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని, ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ ఎస్ కింద వైద్య సేవలు కూడ అందించలేమని ఆస్పత్రుల సంఘం ఆశా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు ప్రభుత్వం చికిత్సల కోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని, డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని నవంబర్ లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వానికి డిసెంబర్ 22న ఈ మేరకు లేఖ కూడా రాశామని, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్ణయించిన ప్యాకేజీ ధరలను, ఆ తర్వాత ఇప్పటివరకు పెంచలేదని, పైపెచ్చు వార్షిక చికిత్స పరిమితిని ఐదు లక్షల నుండి 25 లక్షలకు పెంచడంతో ఆసుపత్రుల మీద మరింత ఆర్థిక భారం పెరిగిందని, ఇది ఇబ్బందికరంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు నిరసన కొనసాగిస్తామని ఆశా వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+