తిరుమల శ్రీవారి మేల్‌చాట్, ఉల్చాట్ వస్త్రాల ఈ వేలం.. అసలేమిటీ మేల్‌చాట్ వస్త్రాలు?
ఏడుకొండల పైన కొలువైన, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించిన మేల్ చాట్ వస్త్రాల ఈ వేలం ప్రక్రియ నేటి నుండి కొనసాగుతుంది.తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్, ఉల్చాట్, ఉత్తరీయం వస్త్రాలను టీటీడీ ఈ-వేలం ద్వారా విక్రయిస్తోంది. ఈ ఆన్‌లైన్ వేలం జనవరి 19, నేటినుంచి జనవరి 22వ తేదీ వరకు జరగనుంది.
మేల్ చాట్, ఉల్ చాట్ వస్త్రాల వేలం
శ్రీవారి అలంకారాల్లో ఉపయోగించిన లేదా భక్తులు కానుకగా సమర్పించిన ఈ వస్త్రాల్లో కొత్తవి, ఉపయోగించినవి, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 137 లాట్లను ఈ-వేలంలో ఉంచి విక్రయాలు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం ఉపయోగించలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఈ వస్త్రాలకు భక్తుల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నారు.

ఈ వస్త్రాల కొనుగోలుకు భక్తుల ఆసక్తి
మేల్‌చాట్, ఉల్చాట్ వంటి కవచ వస్త్రాలు, అలాగే ఉత్తరీయం వస్త్రాలు శ్రీవారి సేవలో ఉపయోగించినవిగా భావించబడటంతో, వీటిని భక్తులు ఆధ్యాత్మిక విశేషంగా భావించి అధిక సంఖ్యలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ-వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
పారదర్శకంగా ఈ-వేలం
ఈ ఈ-వేలంలో పాల్గొనదలచిన వారు, స్వామివారికి సమర్పించిన మేల్ చాట్ వస్త్రాలను కొనుగోలు చేయదలచిన వారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లు అయిన www.tirumala.org లేదా www.konugolu.ap.govt.inను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఇతర సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. భక్తులకు సౌకర్యవంతంగా, పారదర్శకంగా ఈ-వేలం నిర్వహిస్తున్నట్టు టిటిడి అధికారులు చెబుతున్నారు.
మేల్ చాట్.. స్వామివారి అలంకారంలో ఉపయోగించే ప్రత్యేక కవచ వస్త్రాలు
ప్రస్తుతం స్వామివారికి సంబంధించి వేలం వేస్తున్న మేల్ చాట్, ఉల్ చాట్ వస్త్రాలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మేల్ చాట్ వస్త్రాలు అంటే స్వామివారి అలంకారంలో ఉపయోగించే ప్రత్యేక కవచ వస్త్రాలు. ఇది చిన్నచిన్న లోహపు ఉంగరాల తో వెండి లేదా బంగారంతో తయారుచేసిన జాలి లాంటి వస్త్రం. ఈ వస్త్రాన్ని స్వామివారి బయట అలంకారంగా ధరింపజేస్తారు. శ్రీవారి రాజసత్వానికి, పరాక్రమానికి, ఐశ్వర్యానికి ఇది ప్రతీకగా చెబుతారు.
ఉల్ చాట్.. లోపల వేసే అంతర్గత మెత్తని పట్టు వస్త్రం
ఉల్ చాట్ అంటే మేల్ చాట్ కు లోపల వేసే అంతర్గత వస్త్రం. దీనిని మృదువైన వస్త్రంతో తయారుచేసి, లోహపు మేల్ చాట్ శరీరానికి నేరుగా తగలకుండా రక్షణగా చూస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో, విశేష అలంకార సేవలలో ఎక్కువ వినియోగిస్తారు. వీటిని భక్తులు విరాళంగాను, మొక్కుగాను కూడా స్వామివారికి సమర్పిస్తారు .ఈ రెండు శ్రీవారి దివ్య అలంకారంలో భాగంగా ఉపయోగించే వస్త్రాలు. కనుక వీటికి చాలా విశేషం ఉంటుంది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications