బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్: వైష్ణవి చైతన్య, చిరంజీవి వ్యాఖ్యల వీడియోలు వైరల్!!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య క్రేజ్ ఇప్పుడు అందరూ ఆమెపై చర్చించుకునేలా చేస్తుంది. వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా తీసిన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఈ క్రమంలో బేబీ సినిమా సక్సెస్ కావడంతో మెగా కల్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
బేబీ సినిమా మెగా కల్ట్ సెలబ్రేషన్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవిని చూసి బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య సంతోషానికి అవధులు లేవు. హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్ లో తళుక్కు మన మెగాస్టార్ ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య మెగాస్టార్ పై ప్రశంసలజల్లు కురిపించారు. చిరంజీవి సార్.. మీరు గాడ్ ఆఫ్ యాక్టింగ్ అంటూ కొనియాడారు.

మా అందరికీ మీరు ఎంతో ఇన్స్పిరేషన్ అంటూ చెప్పిన వైష్ణవి చైతన్య తాను చేసిన సినిమాకి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ రావడం నిజంగా సినిమా యూనిట్ ప్రతి ఒక్కరికి ఒక సెలబ్రేషన్ అంటూ పేర్కొన్నారు. యూట్యూబ్లో వీడియోలు చేసే సమయంలో మెగాస్టార్ పాటకు ఒక చిన్న బిట్ కు డాన్స్ చేస్తేనే గొప్పగా చెప్పుకునే దానినని, ఇప్పుడు మెగాస్టార్ తన సినిమా కోసం ఇక్కడవరకు రావడం పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు.
మీ సినిమాలు చూస్తూ పెరిగామంటూ పేర్కొన్నారు. చాలా మాట్లాడాలి అని అనుకున్నానని, కానీ చిరంజీవి గారిని చూసిన సంతోషంలో మాటలు రావడం లేదంటూ పేర్కొన్నారు. చిరంజీవి గారిని దగ్గర నుండి చూస్తామా అన్న స్టేజ్ నుండి ఆయన తన సినిమా ఫంక్షన్ కి ఆయన రావడం చాలా పెద్ద విషయమని వైష్ణవి చైతన్య పేర్కొన్నారు .చిరంజీవి ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారంటూ వైష్ణవి చైతన్య కితాబిచ్చారు.

ఇక వైష్ణవి చైతన్య పై మాట్లాడిన చిరంజీవి కూడా సినిమా మొదట్లో అందంగా లేని వైష్ణవి చైతన్య తర్వాత అద్భుతంగా చేసిందని మొదటి సినిమాతోనే ఇంతటి పర్ఫామెన్స్ ఇచ్చిందని తెలిపారు. అంతేకాదు వైష్ణవిని చూస్తే చెమటలు పడుతున్నాయని చిరంజీవి జోకులేశారు. సహజ నటి జయసుధ పేరును ప్రస్తావించిన చిరంజీవి వైష్ణవి చైతన్యకు అంతటి టాలెంట్ ఉందని, వైష్ణవి చైతన్య మరో సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంటుందని, మంచి ఫ్యూచర్ ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications