వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిఏసి భేటి: గడువులోపే ముగించాలన్న దామోదర

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను సజావుగా కొనసాగించేందుకు కోసం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం బిఏసి సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు బిఏసి సమావేశం వాడివేడిగా జరిగింది. విభజన బిల్లు చర్చపై ఇరు ప్రాంతాల సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ జరిపేందుకు సమయం కావాలని, సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని సీమాంధ్ర సభ్యులు కోరగా.. గడువు అవసరం లేదని, గడువులోపే బిల్లుపై చర్చను ముగించాలని తెలంగాణ సభ్యులు కోరారు.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ పూర్తయ్యాక అన్ని నోటీసులను పరిగణలోకి తీసుకోవాలని బిఏసి నిర్ణయించింది. కాగా ముసాయిదా బిల్లుపై చర్చ ముగిశాకే తీర్మానాల గురించి ఆలోచించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుతో తమకు సంబంధం లేదని దామోదర తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోపే చర్చను ముగించాలని ఆయన అన్నారు.

BAC meet complete: Members explains their views

గడువు కావాలి: అశోక్, అవసరం లేదన్న రావుల

ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉన్నందున చర్చించేందుకు మరింత సమయం కావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజు అన్నారు. కాగా బిల్లుపై చర్చకు ఎలాంటి గడువు అవసరం లేదని మరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ అన్నారు.

బిల్లుపై చర్చకు మరింత గడువు ఇవ్వాలని కోరినట్లు సీమాంధ్ర టిడిపి సభ్యుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. సభలో బిల్లుపై ఓటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మెజార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఓటింగ్ పెట్టాలని, ఇందు కోసం బుధవారం సభలో పట్టుపడతామని చెప్పారు. ఓటింగ్ తప్పకుండా తీసుకోవాలని గాలి అన్నారు.

ముఖ్యమంత్రి నోటీసు ఉపసంహరించుకుంటేనే చర్చ సహకరిస్తామని టిఆర్ఎస్ సభ్యులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ముసాయిదా బిల్లుపై 87 మంది సభ్యులు మాత్రమే తమ అభిప్రాయాలు తెలిపారని, మిగితా సభ్యులు చర్చించేందుకు సమయం మరింత సమయం కావాలని మంత్రి ఆనం నారాయణ రెడ్డి అన్నారు.

సిఎం నోటీసుపై టి నేతల అభ్యంతరం

ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసులు నిబంధనలకు అనుగుణంగా లేనందున తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం సభ్యులు డిమాండ్ చేశారు. సిఎం ఇచ్చిన నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని టిఆర్ఎస్ సభ్యుడు ఈటెల రాజేందర్ కోరారు. సిఎం కిరణ్ శాసనసభను, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని ఈటెల ఆరోపించారు. అవసరమైతే బుధ, గురువారాల్లో 16 గంటలపాటు బిల్లుపై చర్చ జరపాలని అన్నారు.
బిల్లుపై చర్చను అడ్డుకునే వారే ఇప్పుడు గడువు కోరుతున్నారని సిపిఐ శాసనసభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. బిల్లును వెనక్కి పంపమనడంలో అర్థం లేదని ఆయన తెలిపారు.

రాజీనామా చేయాలి: సిఎంపై నాగం

సిఎం కిరణ్ తన ఇష్టానుసారం వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నాగం ఖండించారు. చర్చ జరుగుతున్న సమయంలో సిఎం నోటీసు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. టి బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత సీమాంధ్ర సభ్యులు ఎన్ని నోటీసులైన ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సిఎం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. సిఎం పదవిలో కొనసాగే హర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నాగం డిమాండ్ చేశారు.

English summary
BAC meet Completed on Tuesday led by Speaker Nadendla Manohar. All Party MLAs are attended to the meet. Explain their views on T draft bill debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X