పవన్ కళ్యాణ్ రాజకీయాలపై బర్రెలక్క ఆసక్తికర వ్యాఖ్యలు!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారాలని శత విధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గం మినహాయించి మిగతా అన్నిచోట్ల పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీని ప్రత్యర్ధి పార్టీలు టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి.

ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరఫున ప్రతినిధిగా మొన్న ఎన్నికలలో పోటీ చేసి, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బర్రెలక్క కన్నా పవన్ కళ్యాణ్ పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయని తీవ్రంగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క నయం అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ను తనతో పోలుస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై బర్రెలక్క స్పందించారు. తనకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదని కొంతమంది పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం తనకు బాధను కలిగిస్తుందని ఆమె అన్నారు. ఎవరి పార్టీ వారిది ఎవరి రాజకీయం వారిదని పేర్కొన్న బర్రెలక్క, పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం తనకు బాధను కలిగిస్తుందని స్పష్టం చేశారు.
ఆయన పవర్ ఆయనది, తన పవర్ తనదేనంటున్న బర్రెలక్క తాను పవన్ కళ్యాణ్ అభిమానిని స్పష్టం చేశారు. ఆయన చాలా మంచివారని, పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ పర్సన్ అని కొనియాడారు. ఆయనను మైనస్ చేయాలని భావిస్తున్న కొందరు తనను వాడుతున్నారని, ఇది కరెక్ట్ కాదు అని ఒక మీడియా ఇంటర్వ్యూలో బర్రెలక్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications