సీబీఐ ఎఫెక్ట్: హఠాత్తుగా సభ నుంచి వెళ్లిన జగన్, వైసిపి.. అందుకేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లారు. దీనిపై టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర తనదైనశైలిలో స్పందించారు.

సీబీఐ ఝలక్: బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు, 7లోగా చెప్పాలని జగన్‌కు సమన్లు

జగన్, వైసిపి సభ్యులు సభలో నుంచి ఉన్నట్లుండి ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదని దూళిపాళ్ల అన్నారు. కనీసం వాకౌట్ చేస్తున్నామని కూడా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Behind YS Jagan leave from AP Assembly!

సభ నుంచి బయటకు వచ్చాకే తనకు కూడా విషయం అర్థమయిందని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిటిషన్ దాఖలు చేయడంతో వెళ్లిపోయారా అని ప్రశ్నించారు.

బెయిల్‌ను రద్దు చేయాల‌ని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిష‌న్ వేయ‌డంతోనే, ఆ వార్త తెలుసుకొని జగన్ ఆందోళ‌న‌గా వెళ్లిపోయార‌ని ఎద్దేవా చేశారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఇప్ప‌టికే ఎంతో జాప్యం జ‌రిగింద‌ని, ఇప్పటికైనా వేగంగా ముందుకు వెళ్లాల‌న్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Dulipalla Narendra on Tuesday revealed Why YSR Congress Party chief YS Jaganmohan Reddy leave AP Assembly.
Please Wait while comments are loading...