ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ మీదుగా 'భారత్ గౌరవ్' జ్యోతిర్లింగ యాత్రా స్పెషల్ రైలు!!

ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది ఐ ఆర్ సి టి సి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో "భారత్ గౌరవ్" పర్యాటక రైలు ఆగస్టు నాలుగవ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించింది. వరంగల్ మీదుగా రామేశ్వరం, జ్యోతిర్లింగ, దివ్య దక్షిణ యాత్ర నిర్వహిస్తున్నట్టుగా ఐఆర్సిటిసి డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య ఒక ప్రకటనలో వెల్లడించారు.

దివ్య దక్షిణ యాత్ర.. భారత్ గౌరవ్ యాత్ర ఇలా
రామేశ్వరం, జ్యోతిర్లింగాలతో పాటు దివ్య దక్షిణ యాత్ర చేయాలని భావిస్తున్న వారికోసం ఏర్పాటు చేసిన ఈ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఆగస్టు 4వ తేదీన సికింద్రాబాద్ లో ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులకు వెళుతుందని ఆయన వెల్లడించారు.

Bharat Gaurav jyotirlinga yatra train through Telangana and ap from august 4th hurry up for bookings

ఫుడ్, దర్శనం అంతా వాళ్ళే
ఈ రూట్లో ఉన్న పుణ్యక్షేత్ర సందర్శనాన్ని చేయిస్తూ ఈ రైలు సాగుతుందని మొత్తం ఈ యాత్ర 8 రాత్రులు తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత్ గౌరవ్ రైలులో ఈ యాత్రకు వెళ్లే వారికి ఉదయం టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం తెలుగు భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, కాఫీ. రాత్రిపూట టిఫిన్ పెడతారని తెలిపారు.

తీర్ధయాత్రలో బాధ్యత అంతా వారిదే
ఇక ఈ క్షేత్రాల సందర్శన సమయాల్లో వీరికి కావలసిన ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్, నాన్ ఏసీ, ఏసీ క్లాస్ వారికి ఏసీ రూముల సదుపాయం కల్పిస్తారని పేర్కొన్నారు. ఇక రైలులో ప్రతి బోగీలోనూ ఎస్కార్ట్ ఉంటారని, ప్రయాణికులను దగ్గరుండి దర్శనానికి తీసుకువెళ్లడమే కాకుండా, తిరిగి రైల్లో తీసుకువచ్చే సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు.

టికెట్ ఇలా బుక్ చేసుకోండి
ఈ రైలులో సీసీ కెమెరాలు, మైక్, లగేజీ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తారని వెల్లడించారు, ఈ రైలులో దివ్య దక్షిణ యాత్ర చేయాలనుకునేవారు www.irctctourism.com ను సంప్రదించాలని సూచించారు. ఈ రైలులో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్టు ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ కి 14250, సెకండ్ క్లాస్ ఏసీ కి 28450, త్రీ టైర్ ఏసీ కి 21,900గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దివ్య దక్షిణ యాత్ర చేయాలనుకునేవారు బుకింగ్స్ కోసం 92814 95843,9281495845, 82879 32229 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+