Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమవుతున్నవేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల్లో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు ఆయనకు అవకాశం లభించింది.

సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో తనను అరెస్టు చేయొచ్చనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో అచ్చెన్నాయుడుపై ఎలాంటి దూకుడు చర్యలొద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అదనపు సమాచారం సమర్పించేందుకు సీఐడీ ఏప్రిల్ 2 వరకూ గడువు కోరడంతో అప్పటివరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

big relief to ap tdp chief atchannaidu as hc order against hasty steps in skill case

స్కిల్ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు పలువురు అరెస్టు అయ్యారు. అనంతరం హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 17ఏ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో తీర్పు కూడా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో తదుపరి చర్యల విషయంలో న్యాయస్ధానాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు సహా ఇతర నిందితులకూ బెయిల్స్ లభించాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడికీ ఎన్నికల వేళ ముందస్తు బెయిల్ లభిస్తే పూర్తిగా ఊరట లభించినట్లే భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+