AP: ట్రంప్ నిర్ణయంతో ఏపీకి బిగ్ రిలీఫ్..! ఎలాగో చెప్పిన మంత్రి..!

భారత్ పై గతంలో విధించిన 25 శాతం సుంకాల్ని 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో భారత్ లో పలు రాష్ట్రాలకు, అలాగే పలు రంగాలకు కూడా ఊరట లభిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ (ap)లోని పలు రంగాలకు ఊరట దక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయం, అనుబంధ రంగాలకు ట్రంప్ నిర్ణయం ఎలా మేలు చేస్తుందో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ఏపీకి సుంకాల ఊరట (AP)

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. అధిక టారిఫ్‌ల కారణంగా గత నెలల్లో తగ్గిన ఎగుమతులు మళ్లీ పుంజుకునే అవకాశముందన్నారు అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరుగుతుందన్నారు.

big relief to AP with donald trump s tariff slash decision Agri minister reveal details

ఈ రంగాలకు రిలీఫ్

ఫ్రోజెన్ ష్రింప్ సహా సముద్ర ఆహార ఎగుమతులు 10 నుండి 15 శాతం వరకు పెరిగే అవకాశముందని, ప్రాసెసింగ్ రంగంలో లాభ మార్జిన్లు మెరుగవుతాయని ఆయన తెలిపారు. ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గతంలో ట్రంప్ సుంకాల మోతతో ఆయా రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఇప్పుడు సుంకాల తగ్గింపుతో ఆయా రంగాలకు భారీ ఊరట లభించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+