Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ట్రయాంగిల్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ ! అంతా షాక్..

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి, భార్య దువ్వాడ వాణి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీలో ఇవాళ మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తాను నివాసం ఉంటున్న ఇంటి విషయంలో భార్య దువ్వాడ వాణి, పిల్లల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన నేపథ్యంలో శ్రీనివాస్ నోరు విప్పారు.ఆ ఇంటి విషయంలో ఏం జరిగిందో ఇవాళ బయటపెట్టేశారు.

ఇవాళ మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు మాధురి ఫోన్ చేశారు. దీంతో ఫోన్లోనే ఆమెకు ఇంటిపై దువ్వాడ క్లారిటీ ఇచ్చేశారు. మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు ఉన్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం ఈ అప్పు చేశానని తెలిపారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశానికి రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉందని కూడా వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని దువ్వాడ వెల్లడించారు. మనస్ఫూర్తిగానే తన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానన్నారు.

big twist in ysrcp mlc duvvada Srinivas triangle story as he reveals fact

మరోవైపు తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదని మాధురి వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణీ ప్రయత్నం చేశారని మాధురి ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ను సృష్టించారని ఆరోపించారు. దువ్వాడ వాణీ ఏఐ వాయిస్ రికార్డ్ ప్లాన్ చేశారన్నారు. తమ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని, తనపై హత్యాయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

పార్టీ కార్యక్రమాలు చేసేందుకు, తన ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తానన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి ,కుమార్తెలు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారు. దీంతో దివ్వెల మాధురి తన ఇంటిని స్వాధీనం చేసుకుంది. మొత్తం మీద గొడవ సద్దుమనగడంతో పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద నుండి అందరినీ ఖాళీ చేయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+