వెయిట్ చేసీ చేసీ..: శిల్పా మోహన్ రెడ్డికి తొలిరోజే జగన్ అలా షాక్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, నంద్యాల రాజకీయ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డికి తొలి రోజే చేదు అనుభవం ఎదురయిందని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ కోసం శిల్పా బుధవారం వైసిపిలో చేరారు.

చదవండి: శిల్పాకు అఖిలప్రియతో సహా వైసిపి నేత షాక్

ఆయన పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో నంద్యాల టిక్కెట్ కోసం వైసిపిలో పోరు మరింత ఎక్కువయినట్లయింది. ఈ విషయం పక్కన పెడితే ఆయనకు తొలిరోజు నిరాశ మిగిల్చిందంటున్నారు.

జగన్‌తో కలిసి మాట్లాడాలనుకుంటే...

జగన్‌తో కలిసి మాట్లాడాలనుకుంటే...

వైసిపిలో చేరిన తర్వాత జగన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడేందుకు శిల్పా మోహన్ రెడ్డి ఉత్సాహం చూపారు. జగన్‌ మాత్రం ఆయన ఉత్సాహాన్ని నీరుగారుస్తూ చేరికల కార్యక్రమం ముగియగానే లోపలికి వెళ్లిపోయారని అంటున్నారు.

జగన్ కోసం వేచి చూశారు..

జగన్ కోసం వేచి చూశారు..

ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియకా శిల్పా మీడియా సమావేశ మందిరానికి వెళ్లారు. అక్కడ కాసేపు జగన్ కోసం వేచి చూశారు. మిగతా నేతలు కూడా జగన్ వస్తారని భావించారని తెలుస్తోంది.

విజయసాయి రెడ్డి సమాధానం..

విజయసాయి రెడ్డి సమాధానం..

జగన్ రాకపోయేసరికి.. రాజ్యసభ ఎంపి విజయ సాయి రెడ్డిని ఫోన్లో సంప్రదించారని తెలుస్తోంది. దానికి విజయసాయి... మీరు మాట్లాడటం ప్రారంభించండని, అయిదు నిముషాల్లో నేను జగన్‌ని తీసుకుని వస్తారనని శిల్పాకు చెప్పారని అంటున్నారు.

చూసి.. చూసి మాట్లాడారు

చూసి.. చూసి మాట్లాడారు

జగన్ వచ్చాకే మీడియాతో మాట్లాడుతానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారని, ఆయన వచ్చే దాకా ఆగుతానని విజయ సాయితో అన్నారని, కానీ ఆ తర్వాత పావుగంట పాటు వేచి చూసినా రాలేదని అంటున్నారు. ఆ తర్వాత కాసేపటికి శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జగన్‌తో కలిసి భోజనం

జగన్‌తో కలిసి భోజనం

అయితే, విలేకరుల సమావేశం అనంతరం శిల్పా మోహన్ రెడ్డి, ఆయనతో వచ్చిన పలువురు ముఖ్య నాయకులను విజయ సాయి రెడ్డి తన వెంట లోపలకు తీసుకు వెళ్లారు. జగన్‌తో కలిసి భోజనం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bitter experience to Former minister Shilpa Mohan Reddy on first day in YSR Congress Party?
Please Wait while comments are loading...