Kasturi: అంతఃపుర మహిళలకు బానిసలేగా..! తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్..

గతంలో భారతీయుడు సహా పలు సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి.

గతంలో రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని, ఇప్పుడు అలా వచ్చిన వారంతా తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని నటి కస్తూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పిన చెప్పడానికి మీరెవరంటూ ద్రవిడ వాదుల్ని కస్తూరి ప్రశ్నించారు.

bjp leader actress kasturi new definition to telugu people

ప్రస్తుతం తమిళనాడు కేబినెట్ లో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులు ఉన్నారని కస్తూరి గుర్తుచేశారు. తమకు ప్రభుత్వంలో భాగం, అధికారంలో భాగం కావాలంటూ డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమాళవన్ కొత్త నినాదం తెస్తున్నారని, వారికి ఎప్పుడో ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారని కస్తూరి తెలిపారు. తమిళనాడులో బ్రాహ్మణులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కలిసికట్టుగా ఉండాలని, ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దని, ఇతరుల భార్యలపై మోజు పడొద్దని చెప్తున్నారని, అందుకే వీరికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+