తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా నేత వార్నింగ్, రోడ్డుపై భూమన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపి చింతా మోహన్ హాజరయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం నేతలు మూకుమ్మడిగా సభా వేదిక పైకి వచ్చి నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి డౌన్ డౌన్, జై సమైక్యాంధ్ర అంటూ కొంతమంది నినాదాలు చేశారు. ఎమ్మెల్యే భూమనను మాట్లాడడానికి అనుమతించాలని పట్టుబట్టారు. దీంతో రచ్చబండ రసాభాసగా మారింది. ఆందోళనకారులు వెళ్లిపోవాలని పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆగ్రహించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆమె ఎక్కి వున్న టేబుళ్లను లాగేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందకు దూకేశారు. శ్రీదేవికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులకు వాగ్వాదం జరిగింది. ఓ దశలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా అక్కడున్న ఆందోళనకారులు కుర్చీలను గాల్లోకి విసిరి వేయడం, ఖాళీ వాటర్ బాటిళ్లను, ప్యాకెట్లను వేదికపై వున్న విఐపిలపై విసిరి వేశారు.

రచ్చబండ 1

రచ్చబండ 1

ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఉత్తిత్తి ప్రసంగాలు వద్దని సిపిఎం, సిపిఐ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

రచ్చబండ 2

రచ్చబండ 2

పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పార్లమెంటు సభ్యుడు చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా వేదిక మీద నుండి వెళ్లిపోవడానికి సిద్ధమైయ్యారు.

రచ్చబండ 3

రచ్చబండ 3

పోలీసులు వారికి రక్షణ కల్పిస్తూ అక్కడ నుండి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు అక్కడ ధర్నా చేశారు.

రచ్చబండ 4

రచ్చబండ 4

పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే భూమన, టిడిపి నేతలు రాజేంద్ర తదితరులను పోలీసులు అరెస్టు చేసి తిరుచానూరు పిఎస్‌కు, ఈస్టు పిఎస్‌కు తరలించారు.

రచ్చబండ 5

రచ్చబండ 5

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపి చింతా మోహన్ హాజరయ్యారు.

రచ్చబండ 6

రచ్చబండ 6

ఎంపి చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణలను పోలీసులు వేదిక పై నుండి తీసుకెళ్లడంతో ఆందోళనకారులు నినాదాలు చేస్తూ రోడ్డుమీదే ధర్నాకు దిగారు.

రచ్చబండ 7

రచ్చబండ 7

ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం నేతలు మూకుమ్మడిగా సభా వేదిక పైకి వచ్చి నినాదాలు చేశారు.

English summary
Agitators thrown water battles at Chittoor Congress MP and former MLA Venkataramana in Rachabanda programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X