గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాచర్లలో బాలుడి కిడ్నాప్ కలకలం : సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు

|
Google Oneindia TeluguNews

అమరావతి : గుంటూరు రైల్వే స్టేషన్ లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మాచర్లకు చెందిన సిద్ధూ అనే ఆరేళ్ల బాలుడిని గుంటూరు రైల్వేస్టేషన్ నుండి గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడి కిడ్నాప్ పై తల్లిదండ్రులు మాచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు .. గుంటూరు రైల్వే స్టేషన్ లో లభించిన వీడియో ఆధారంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్తున్నట్లు గుర్తించి గాలింపు మొదలుపెట్టారు.

boy kidnap in macharla

కిడ్నాప్ కలకలం
సిద్దు కిడ్నాప్‌నకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ఫోటోలోని వ్యక్తి కోసం బృందాలు రంగంలోకి దిగాయి. ఇటు సిద్దు తల్లిదండ్రులు సరోజ, వెంకటేశ్వర్లు .. బాలుడు తమ పేర్లను చెబుతారని పేర్కొన్నారు. అంతేకాదు తమది మాచర్ల .. నెహ్రూనగర్ అని చెప్తారని తెలిపారు.

బాలుడి ఆచూకీ తెలిస్తే మాచర్ల పోలీసుస్టేషన్‌లో లేదంటే తమను సంప్రదించాలని కోరుతున్నారు. 9440796188, మాచర్ల టౌన్ SI 9491331822, నంబర్స్ కు డయల్ -100 ద్వారా పోలీస్ కంట్రోల్ కు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని పేరెంట్స్, పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

English summary
The kidnappers kidnapped the boy in Guntur railway station. Siddhu, a six-year-old boy from Madurai, was kidnapped by unidentified thugs from Guntur railway station. On the kidnapping of the boy, the parents complained to the police station of Matters. The officers who were investigating the proceedings began to find out that the unidentified person was taking the video based on the video available at Guntur railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X