అఖిలప్రియ పట్టుసాధించారా? : నంద్యాల బరిలో బ్రహ్మానందరెడ్డి!

Subscribe to Oneindia Telugu

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబం నుంచే అభ్యర్థి ఉండాలని పట్టుబడిన మంత్రి భూమా అఖిలప్రియ మొత్తానికి అనుకున్నది సాధించినట్లు కనిపిస్తోంది. నంద్యాల బరిలో తానుంటానని టీడీపీ అధిష్టానంతో చాలా సార్లు మొరపెట్టుకున్న మాజీమంద్రి శిల్పామోహన్ రెడ్డి.. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అఖిలప్రియకు లైన్ క్లియర్ అయ్యింది.

బాబుకు శిల్పామోహన్ షాక్: రెండ్రోజుల్లో జగన్ పార్టీలోకి, అంతా అఖిలప్రియ వల్లే!

నంద్యాల బరిలో భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల బరిలో భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. ఇప్పటివరకూ ఆయనకు పోటీగా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లడం, మాజీ మంత్రి ఫరూఖ్, ఎంపి ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు సహా అందరూ బ్రహ్మానందరెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారయింది.

అధికారిక ప్రకటనే ఆలస్యం..

అధికారిక ప్రకటనే ఆలస్యం..

ఈ మేరకు నేడో, రేపో బ్రహ్మానందరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అఖిలప్రియ కూడా ఈ మేరకు అధిష్టానంతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా, వైసీపీ నేత కాటసాని రామిరెడ్డికి అల్లుడు కూడా అయిన బ్రహ్మానందరెడ్డి బరిలో ఉంటే, బలమైన కాటసాని వర్గం కూడా పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న అంచనా పార్టీ నాయకత్వంలో ఉంది.

వైసీపీలో శిల్పా కలకలం

వైసీపీలో శిల్పా కలకలం

ఇది ఇలా ఉండగా, అటు శిల్పామోహన్ రెడ్డి చేరిక వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ ఆ పార్టీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డికి శిల్పా చేరికతో అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని అంటున్నారు.

జగన్ ఏం చేస్తారో?

జగన్ ఏం చేస్తారో?

వచ్చే ఎన్నికల్లో శిల్పాకు ఎంపీ సీటు ఇచ్చి, రాజగోపాల్‌రెడ్డికి నంద్యాల సీటు ఇస్తామన్న ప్రతిపాదనను ఆయన అంగీకరించేలా లేదు. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి జూన్ 19న తన వర్గీయులతో హైదరాబాద్ వెళ్లి జగన్‌తో భేటీ కానున్నారు. ఎవరూ లేనప్పుడు తమను వాడుకుని, ఇప్పుడు శిల్పా చేరిన తర్వాత తమకు అన్యాయం చేయడంపై రాజగోపాల్ వర్గం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ నిర్ణయం కీలకంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Bhuma Brahmananda Reddy may contest from Nandyal in bypoll.
Please Wait while comments are loading...