కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థి దండు శేషు యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. శేషు యాదవ్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ గూడురు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన అధికారులు ఫోర్జరీ నిజమని తేలడంతో శేషు నామినేషన్‌ను తిరస్కరించారు. దాంతో పాటు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్, స్వతంత్ర అభ్యర్థులు పుల్లెల నాగిరెడ్డి, పులి జయప్రకాశ్ రెడ్డిల నామినేషన్లను ఆమోదించారు. కాగా ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు.












Click it and Unblock the Notifications