బాబుకే సారథ్యం.. పెద్ద నోట్ల రద్దుపై ఆరు రాష్ట్రాల సీఎంలతో సబ్ కమిటీ..

Subscribe to Oneindia Telugu

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేంద్రం ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సాయంత్రం చంద్రబాబుకు విషయాన్ని ముందుగానే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలతో కూడిన సబ్ కమిటీని మంగళవారం నాడు కేంద్రం ఏర్పాటు చేసింది.

మ‌ధ్యప్ర‌దేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం నారాయణ, త్రిపుర మాణిక్ సర్కార్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లను కమిటీలో సభ్యులుగా నియమించింది కేంద్రం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తారు. నోట్ల రద్దు నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీలే ప్రధాన అజెండాగా కేంద్రం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

నగదు రహిత లావాదేవీలతో పాటు కార్డుల వినియోగానికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సబ్ కమిటీ కేంద్రానికి నివేదిక అందించనుంది. కాగా, వచ్చే నెల 2న సబ్ కమిటీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central was formed a sub committee over currency ban effects across the country. AP CM Chandrababu naidu will leads committee with six other states cms
Please Wait while comments are loading...