చంద్రబాబు-పవన్ కొత్త మైండ్ గేమ్ ? వైసీపీ వ్యూహాలతో టర్నింగ్ ! ఏం జరగబోతోంది ?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోతున్నారు. ముఖ్యంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను వాడేస్తున్నారు. ఏం చేసి అయినా ప్రత్యర్ధిపై ఏదో విధంగా తాము పైచేయి సాధించామని అనిపించుకుంటే చాలు ఎన్నికల వాతావరణంలో ముందంజ వేయొచ్చన్న భావన వారిలో కనిపిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ మొదలుపెట్టిన విమర్శల్ని కౌంటర్ చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వైఎస్ జగన్ మాత్రమే పోటీలో ఉన్నారు. కానీ విపక్షాలకు అలా కాదు చంద్రబాబు, పవన్ ఇద్దరూ పోటీలో ఉండాల్సిన పరిస్ధితి. లేకపోతే ఒకరి సీఎం పదవి కోసం మరొకరు సాయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుంచి పవన్ పై మొదలైన ఈ విమర్శల హోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబును ఎలాగైనా సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో చంద్రబాబు-పవన్ అప్రమత్తం అయ్యారు.

chandrababu and pawan kalyan begin new mind game over chief minister post to counter ysrcp

చంద్రబాబు సీఎం అయ్యేందుకు పవన్ సాయం చేస్తున్నారన్న విమర్శలతో ఆయనకు అండగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పవన్ కూడా అప్రమత్తమై తాను కూడా పోటీలో ఉన్నట్లు చెప్పేస్తున్నారు. సీఎం పదవి చేపట్టేందుకు తనకు పదేళ్ల అనుభవం సరిపోతుందని, మీరు మద్దతిస్తే తాను సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ ప్రజల్ని కోరుతున్నారు. తద్వారా తాను సీఎం కాకుండా చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వైసీపీ విమర్శల్ని కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు మాత్రం తనకు సీఎం పదవిపై ఆశ లేదంటూ తాజాగా కోనసీమ జిల్లా రావులపాలెంలో వ్యాఖ్యానించారు. తద్వారా సీఎం పదవి వస్తే సరి, లేకపోతే పోనీ అన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు తన సీఎం పదవిని త్యాగం చేసి పవన్ ను సీఎం చేస్తారా అన్న సంకేతాలు జనసేన, కాపు సామాజికవర్గంలోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. అదీ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసేందుకు ఎన్నుకున్న జిల్లా కూడా కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో వ్యూహాత్మకంగానే ఈ మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. చివరికి జరిగేది ఏమైనా పొత్తుకు ముందు ఇలా వైసీపీని కన్ ఫ్యూజ్ చేసేలా చంద్రబాబు-పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+