ఉబ్బి తబ్బిబ్బైన హోంమంత్రి వంగలపూడి అనిత
మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే తుఫాన్ కారణంగా ఆస్తి, ప్రాణనష్టం లేకుండా పనిచేశామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అదించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రధానం చేశారు.
తుఫాను సమయంలో ప్రాణ నష్టం లేకుండా కాపాడాం: చంద్రబాబు
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు తుఫాన్ సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించామని, పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడామని పేర్కొన్నారు. ఇక వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయని, సాంకేతికతతో పాటు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని ఆయన అన్నారు.

వంగలపూడి అనితను సత్కరించిన సీఎం చంద్రబాబు
ఇక ఇదే సమయంలో మొంథా తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు అభినందించారు. అత్యుత్తమ సేవలందిచిన అధికారులను, సిబ్బందిని గౌరవించిన కార్యక్రమంలో సీఎం హోం మంత్రి వంగలపూడి అనితను సత్కరించారు. హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రశంసా పత్రంతో పాటు ఉత్తమ సేవా అవార్డును ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చేతుల మీదుగా అందజేశారు.
చంద్రబాబు శిష్యరికంలో అదే నేర్చుకున్నాం: వంగలపూడి అనిత
తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో ఆమె కీలక పాత్ర పోషించారని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజాసేవలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపించిన మార్గం తమకు దిశానిర్దేశం చేస్తుంది అన్నారు. చంద్రబాబు శిష్యరికంలో ప్రజలకు సేవ చేయడం నేర్చుకున్నామని ఆమె తెలిపారు.
తన జీవితంలో మర్చిపోలేని అనుభవం
ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మా బాధ్యతగా భావిస్తున్నామని వంగలపూడి అనిత వెల్లడించారు. చంద్రబాబు చేతుల మీదుగా సైక్లోన్ మొంథా ఫైటర్ సర్టిఫికెట్ స్వీకరించడం, ప్రశంసలు అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవం అన్నారు. ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో మొంథా తుఫాన్ సమయంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడుకోగలిగామని వంగలపూడి అనిత అన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications