కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: బాబు ఏమన్నారంటే..?, ఎస్టీల్లోకి బోయ, వాల్మీకి

Subscribe to Oneindia Telugu
Chandrababu Naidu on Kapu Reservation Bill in AP Assembly | Oneindia Telugu

అమరావతి: కాపులకు రెండు దశాబ్దాల్లో ఎవరూ చేయంది తాము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.

కాగా, విద్యా, ఉద్యోగ భర్తీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు శనివారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాపు రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రానికి తీర్మానం చేశారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 55శాతానికి చేరుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ వేశామని అన్నారు. అన్ని జిల్లాల్లో తిరిగి బీసీ కమిషన్ అధ్యయనం చేసిందని తెలిపారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.

అప్పుడే హామీ ఇచ్చా

అప్పుడే హామీ ఇచ్చా

తాను పాదయాత్ర సమయంలోనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి వెనకబడి ఉన్నారని తెలుసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారి కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. అప్పుడే తాను కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే, పిఠాపురం ఎన్నికల సభలోనే తాను కాపులకు రిజర్వేషన్ల హామీ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు.

 బీసీలే వెన్నెముక

బీసీలే వెన్నెముక

అంబేద్కర్ స్ఫూర్తితోనే రిజర్వేషన్లు ఇస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించేందుకు రిజర్వేషన్లు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో కాపు, తెలగ, బలిజ, ఒంటరిల జనభా 11.65శాతంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని అన్నారు.

ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

టీడీపీలో కాపు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని చెప్పారు. కాపులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇతర బీసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు ఆరోపణలు చేస్తారని అన్నారు. కమిషన్ సూచన మేరకు 5శాతం రిజర్వేషన్లను కాపులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇతర కులాలకు ఇంతకుముందున్న రిజర్వేషన్లు అలాగే ఉంటాయని ఆయన అన్నారు.

 ఇది మా ఘనతే

ఇది మా ఘనతే

కాపులకు కమిషన్ ఏర్పాటు చేసి, ఏడాదికి రూ.1000కోట్ల నిధి ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. వెనకబడిన అగ్రవర్ణాలకు కూడా బడ్జెట్ కేటాయించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

 కొందరు ఓర్చుకోవడం లేదు.. చట్టం తెస్తాం

కొందరు ఓర్చుకోవడం లేదు.. చట్టం తెస్తాం

కాపు బిల్లును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఒప్పంచి చట్టంగా తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు. కొంతమందికి సమస్యలు పరిష్కారం కావడాన్ని ఓర్చుకోవడం లేదు, సమాజంలో శాంతి ఉండకూడదని కొందరు భావిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బిల్లుకు ఆమోదం

బిల్లుకు ఆమోదం

విద్యా, ఉద్యోగ భర్తీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు శనివారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు వర్తించవని ఆ బిల్లులో పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రానికి తీర్మానం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు.

కాపు బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా చంద్రబాబు ఆ వర్గానికి న్యాయం చేశారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. అణగారిన వర్గాలను ఆదుకునేందుకు కృషి చేస్తున్న చంద్రబాబును అందరూ అభినందించాల్సిందేనని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉడుములు పట్టుకుని జీవించే వారికి సరైన న్యాయం చేయాలని కోరారు.

వాల్మికీ, బోయలను కూడా ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. వీరిని ఎస్టీల్లో చేర్చేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu responded on Kapu reservations in assembly sessions held on Saturday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి