పని మొదలెట్టిన చంద్రబాబు.. వైసీపీకి షాకిచ్చే కీలక ఆదేశాలు.. బోయపాటి శ్రీనుకు కీలకబాధ్యత!!

టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికలలో కూటమి విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేయగా జూన్ 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని అమరావతిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే ఏపీలో వైసీపీ పాలనపై అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

బోయపాటికి చంద్రబాబు ప్రమాణ స్వీకార పర్యవేక్షణ బాధ్యతలు
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాన్ని పర్యవేక్షించే బాధ్యతను సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీను నేడు చంద్రబాబును కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో బోయపాటి శ్రీనుకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

Chandrababu took control on CM office and gave shocking orders key responsibility to boyapati srinu

సీఎం ఆఫీస్ ను కంట్రోల్ లోకి తీసుకున్న చంద్రబాబు.. కీలక ఆదేశం
ఇదిలా ఉంటే గత ఐదేళ్ల నుంచి ఏపీలో కొనసాగిన వైసీపీ పాలనపై అనేక సందర్భాలలో విరుచుకుపడిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల రోజున కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆఫీస్ ను కంట్రోల్లోకి తెచ్చుకున్న చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు ఉన్న ఏ ఫైల్స్ బయటకు పోకూడదని అధికారులను ఆదేశించారు.

తాజా ఆదేశాలతో చంద్రబాబు వైసీపీ లెక్క తేల్చనున్నారా?
2019 నుంచి 2024 వరకు ఏపీలో వైసిపి అరాచక పాలన కొనసాగిందని, అవినీతి రాజ్యమేలిందని అనేక సందర్భాల్లో పేర్కొన్న చంద్రబాబు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తామంటూ అనేక సందర్భాల్లో చెప్పారు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన అధికారుల పైన పోలీసుల పైన అనేక సందర్భాల్లో మండిపడిన చంద్రబాబు ఇక వారందరి లెక్క తేల్చడానికి ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తాజా ఆదేశాలతో స్పష్టమవుతుంది.

ఏపీలో గత ఐదేళ్ళలో జరిగిన పరిణామాలు
టిడిపి అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు భద్రత పెంచారు. ఇప్పటికే ఏపీ పోలీసులు చంద్రబాబుకు కాన్వాయ్ సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై, కార్యకర్తలపై జరిగిన దాడులు, మారణకాండలు, చంద్రబాబు సతీమణిని అసెంబ్లీ వేదికగా అవమానించడం, అలాగే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జైలుకు పంపించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు తాజా ఆదేశాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. జైలు జీవితాన్ని అనుభవించారు. వీటన్నిటికీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా సమాధానం చెబుతారని చంద్రబాబు తాజా ఆదేశాలతో అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+