నారా భువనేశ్వరి, లోకేష్ కీలక నిర్ణయాలు-వచ్చే వారం నుంచే..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ పార్టీని నడిపించిన చంద్రబాబు లేని లోటు క్షేత్రస్ధాయిలో క్యాడర్ పై పడుతోంది. దీన్ని అధిగమించేందుకు ఆయన కుమారుడు నారా లోకేష్, భార్య నారా భువనేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని వచ్చే వారం నుంచి అమల్లో పెట్టేందుకు కూడా సిద్దమయ్యారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు దీన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలారు. వీరి కుటుంబాలను పరామర్శించాలని ఆయన భార్య భువనేశ్వరి నిర్ణయించారు. ఇందుకోసం ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. "నిజం గెలవాలి" పేరుతో భువనేశ్వరి ఈ యాత్రలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేశాయి.

మరోవైపు చంద్రబాబు అరెస్టుతో ఆయన అప్పటి వరకూ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రలు నిలిచిపోయాయి. అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. దీంతో చంద్రబాబు స్దానంలో ఆయన కుమారుడు లోకేష్ .. ఈ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిచిన తన యువగళం పాదయాత్ర విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చే వరకూ భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రలు చేపట్టబోతున్న నారా లోకేష్... ఆయన బయటికి వచ్చాక తిరిగి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటివరకూ జిల్లాలలో పర్యటిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రలతో టీడీపీ క్యాడర్ ను ఉత్సాహపరచాలని భావిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నాలుగైదు రోజుల్లో టీడీపీ విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ











Click it and Unblock the Notifications