దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

చిరంజీవి విఫలం! ఆ నిర్ణయంతో తీవ్ర నష్టం: వాసిరెడ్డి పద్మ సంచలనం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి: టాలీవుడ్ మెగాస్టార్, ఎంపీ చిరంజీవి గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూసినా చిరంజీవి అత్యున్నతమైన వ్యక్తిత్వం గలవారని అన్నారు. చిరంజీవి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వ్యక్తులని, ఎవరికీ హాని కలిగించే వ్యక్తిత్వం వారిలో లేదని తెలిపారు.

  భారీ స్పందన.. కీలక నేతలు చేరారు

  భారీ స్పందన.. కీలక నేతలు చేరారు

  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చిందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. దీంతోనే, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా కీలక నేతలు ప్రజారాజ్యంలో చేరిపోయారని చెప్పారు.

  చిరంజీవి విఫలమయ్యారు..

  చిరంజీవి విఫలమయ్యారు..

  అయితే, మెగాస్టార్ గా తనకున్న భారీ ప్రజాభిమానాన్ని, రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చిరంజీవి విఫలమయ్యారని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు.

  డీఫేమ్ అయ్యారేమో..

  డీఫేమ్ అయ్యారేమో..

  రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి డీఫేమ్ అయ్యారేమో అనేది తన భావన అని వాసిరెడ్డి చెప్పారు. అయితే, రాజ్యసభ ఎంపీ పదవి, కేంద్ర మంత్రి పదవిల కోసం ప్రజారాజ్యం పార్టీని పెట్టాల్సిన అవసరం చిరంజీవికి లేదని అన్నారు.

  చిరంజీవి నిర్ణయంతో తీవ్ర నష్టం

  చిరంజీవి నిర్ణయంతో తీవ్ర నష్టం

  చిరంజీవి.. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రజారాజ్యంలో తనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పిన పద్మ... ఆ పార్టీలో తనను కొంత మంది నేతలు టీడీపీ కోవర్ట్‌గా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం ఆధారంగా వారు ఈ విధంగా అనుమానపడ్డారని చెప్పారు.

  చిరంజీవి మాత్రం..

  చిరంజీవి మాత్రం..

  అయితే, చిరంజీవి మాత్రం తనను ఎన్నడూ అలా చూడలేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. కానీ, ఏదో ఒక రోజు చిరంజీవి కూడా ప్రభావితం అవుతారేమోననే భావం తనలో ఉండేదని.. ఈ కారణం వల్లనే కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైనప్పుడు తాను చిరంజీవితో కలిసి వెళ్లలేదని చెప్పారు.

  English summary
  YSRCP official Spokesperson Vasireddy Padma has heaped praise on Mega Star Chiranjeevi about his overall aspects. In an exclusive interview with a programme of Talking Politics, YSRCP senior leader reacting to a question on Chiranjeevi's Praja Rajyam Party(PRP) said after the failure of PRP in the election, many people's political future turned doubtful.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more