తాడేపల్లి గూడెంలో రేపు చిరంజీవి పర్యటన ... రీజన్ ఇదే
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవిసైరా సినిమా బిజీలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కూడా ప్రస్తుతం తాను కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ప్రచారం చెయ్యని చిరంజీవి రాజకీయాల గురించి ఎక్కడా కూడా మాట్లాడటం లేదు . ఇక తాజాగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ఆయన ఏమైనా మాట్లాడతారా అన్న ఆసక్తి నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు చిరంజీవి తాడేపల్లి గూడెం చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు చిరంజీవి. అక్కడ నుంచి కారులో తాడేపల్లిగూడెం వస్తారు. ఇక అక్కడ విశ్వనటుడు ఎస్‌వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన ఎస్‌వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటానికి రానున్న చిరంజీవికి ఉభయగోదావరి జిల్లాలలో బాగా క్రేజ్ ఉంది.

తాడేపల్లిగూడెం ఎస్‌వీఆర్ సేవా సమితి గూడెంలో కొన్ని నెలల కిందటే ఎస్‌వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే చిరంజీవితో ఆవిష్కరింప జేయాలని ఎస్‌వీఆర్ సేవా సమితి సభ్యులు భావించింది. అయితే చిరంజీవి కూడా సైరా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ మధ్య కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వెళ్లి ఎస్‌వీఆర్ సేవా సమితి సభ్యులు నేరుగా చిరంజీవిని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన చిరంజీవి రేపు తాడేపల్లి గూడెం చేరుకొని రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications