శుభవార్త: త్వరలో అమరావతి నిర్మాణం, డిజైన్లకు బాబు ఓకే, 5 టవర్లుగా సచివాలయం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ ప్రజలు ఎదురుచూసే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అమరావతి డిజైన్లపై సీఎం చంద్రబాబు బుధవారం సంతృప్తి వ్యక్తం చేశారు.

చదవండి: బిల్డింగ్‌లపై ప్రభావం: అమరావతికి ప్రకంపనల ముప్పు, ఆ భూకంపం దెబ్బకు

అవసరమైన మార్పులు చేసి తుదిరూపు ఇవ్వాలని చెప్పారు. ఐదు టవర్లుగా సచివాలయం నిర్మించాలని, సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. హైకోర్టు డిజైన్ రూపుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అసెంబ్లీ డిజైన్‌లో స్వల్ప మార్పులు

అసెంబ్లీ డిజైన్‌లో స్వల్ప మార్పులు

నార్మన్ పోస్టర్స్ డిజైన్లపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ భవనం డిజైన్‌లో స్వల్ప మార్పులు సూచించారు. హైకోర్టు డిజైన్ రూపుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు.

ఐదు టవర్లుగా సచివాలయం

ఐదు టవర్లుగా సచివాలయం

సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల ఆఫీసులకు నాలుగు భారీ టవర్లు ఏర్పాటు చేయాలని, వీటికి కొంచెం దూరంలో సీఎం కార్యాలయం, సీఎం కార్యదర్శుల ఆఫీసులు ఉండాలని సూచించారు. పరిపాలనా శాఖ కార్యాలయం కోసం మరో టవర్ నిర్మించనున్నారు.

సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభం

సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభం

సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. లండన్‌లో నార్మన్ పోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాల్లో ఆర్కిటెక్కులు సమర్పించిన డిజైన్లపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

రెండింటిని క్రోడీకరించి మంచి డిజైన్

రెండింటిని క్రోడీకరించి మంచి డిజైన్

శాసన సభకు సంబంధించి అంతకుముందు పొడవైన స్తంభాకారంలో ఉన్న డిజైన్ పరిశీలనకు వచ్చింది. ఇది గతంలోను ఆకృతి. తాజా డిజైన్లు కూడా చూశారు. ఈ రెండింటిని క్రోడీకరించి మంచి డిజైన్ తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు.

వరుసలో నిర్మించాలా లేక వరుసల్లోనా

వరుసలో నిర్మించాలా లేక వరుసల్లోనా

కాగా, సచివాలయం ఐదు టవర్లుగా ఉండనుంది. అయితే వీటిని ఒకే వరుసలో నిర్మించాలా లేక రెండు మూడు వరుసల్లో నిర్మించాలా అనే అంశంపై చర్చ జరిగింది. పలు ఆప్షన్లు సిద్ధం చేశారు. కాగా, చంద్రబాబు వెంట రాజమౌళి, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Chandrababu Naidu okayed designs for Andhra Pradesh capital Amaravati structures.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి