బిల్డింగ్‌లపై ప్రభావం: అమరావతికి ప్రకంపనల ముప్పు, ఆ భూకంపం దెబ్బకు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి భూప్రకంపనల ముప్పు పొంచి ఉందా అంటే అవుననే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రజ్యోతి కూడా ఈ మేరకు ఓ కథనం రాసింది.

గన్ పాదయాత్రకు 'భారీ వర్షాలు' షాక్!: బాబు వస్తే వర్షాలుండవా, సంతోషం!

కొన్నాళ్లుగా ఒంగోలు నుంచి విజయవాడ వరకు భూప్రకంపనలు సంభవిస్తున్నాయని, దీంతో రాజధానిలో నిర్మించనున్న భారీ బహుళ అంతస్థుల భవనాలు వీటి తీవ్రతను తట్టుకోగలవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది.

గన్నవరంలో భూప్రకంపనలు

గన్నవరంలో భూప్రకంపనలు

రాజధాని ప్రాంతం చెంతనే ఉన్న గన్నవరంలో గురువారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో మరోసారి ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

 జోన్ 3లో అమరావతి ప్రాంతం

జోన్ 3లో అమరావతి ప్రాంతం

భూకంపాలకు సంబంధించి హైదరాబాద్‌ నగరం జోన్ 2లో ఉండగా, అమరావతి ప్రాంతం జోన్ 3లో ఉంది. జోన్ 3 అంటే ఓ మోస్తరుగా భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతం.

 నిర్మాణాలపై ప్రభావం, కాబట్టి

నిర్మాణాలపై ప్రభావం, కాబట్టి

రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతుండటంతో భూప్రకంపనలు వాటిపై ప్రభావం చూపే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని పేర్కొంది. భూప్రకంపనలను తట్టుకునేలా నిర్మాణ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని రాసింది.

 భూకంపాలను తట్టుకునేలా డిజైన్ చేయాలి

భూకంపాలను తట్టుకునేలా డిజైన్ చేయాలి

భవన నిర్మాణ సమయంలోనే భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్‌ చేస్తే అదనంగా అయ్యే వ్యయం ఐదు శాతమేనని, ఓసారి నిర్మించిన తర్వాత ఆ భవనాన్ని భూకంపాలను తట్టుకునే విధంగా మార్పులు చేయాలంటే 20 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భవననిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారని పేర్కొంది.

 నాటి భూకంపం ఎఫెక్ట్

నాటి భూకంపం ఎఫెక్ట్

రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు వస్తున్నాయి. వీటి వల్ల వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. 1993లో మహారాష్ట్రలోని లాతూరులో తీవ్ర స్దాయిలో భూకంపం వచ్చి భారీ నష్టం జరిగిందని, ఆ సమయంలో ఏర్పడిన భూమి పగుళ్లలో ఒక పెద్ద పగులు లాతూరు నుంచి హైదరాబాదు మీదుగా ఒంగోలు వరకు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొంది. ఈ పగులు కారణంగా ఒంగోలులో కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.

కొంతలో కొంత ఊరట, ప్రకంపనల తీవ్రత తక్కువ

కొంతలో కొంత ఊరట, ప్రకంపనల తీవ్రత తక్కువ

గన్నవరం, అమరావతి, నెల్లూరు, ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ భూ ప్రకంపనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది. అయితే, ఈ ప్రాంతాలలో ఇప్పటి వరకు ఏర్పడిన భూప్రకంపనల తీవ్రత 3 నుంచి 5లోపే ఉందని శాస్త్రవేత్తలు చెప్పారని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mild tremors were felt by residents of some villages near Gannavaram creating panic on Tuesday night. According to locals, the tremors occurred twice between 10.30 p.m. and 11 p.m. and residents of Mustabad, Davajigudem, Rayanagar and a few other villages in the mandal rushed out of their houses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి