• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్పాట్‌లోనే సస్పెండ్ చేస్తా...సోమవారం కల్లా మార్పు రావాలి:అధికారులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

By Suvarnaraju
|

అమరావతి: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో డెంగీ, మలేరియా ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వారం రోజులు అత్యవసర పరిస్థితి అని, సీరియస్‌గా పనిచేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.

పరిస్థితిలో సోమవారం కల్లా మార్పు రాకపోతే స్పాట్‌లోనే సస్పెండ్ చేస్తానని అధికారులను సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనని ఆయన స్పష్టం చేశారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరూ పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని సిఎం హెచ్చరించారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీయ పర్యవేక్షణ చేపట్టారు.

CM Chandrababu Strong Warning to officers

అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు అంటువ్యాధుల నివారణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అంటువ్యాధులపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లు, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సీఎం సమీక్షలు చేపట్టారు. టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు సీఎం పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

మనం ఉన్నది ప్రజల కోసమే, వారికి సేవలు అందించడం కోసమే నని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు హితవు పలికారు. ప్రజల్లో సంతృప్తి నిన్న ఎక్కువ ఉండి, ఈరోజు తగ్గడం ఏమిటని సీఎం వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలని...విశాఖలో 72వార్డులకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాలని అధికారులను చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గత కొన్ని రోజులుగా సిఎం చంద్రబాబే నేరుగా ప్రజల నుంచే రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే రెండు వారాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అన్నిచోట్ల పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని మందులు పంపిణీచేయాలని సూచించారు. మురుగు నిల్వలు ఉండరాదని, ఆయా ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలన్నారు. అలాగే కాచి చల్లార్చిన నీటిని తాగేలా ప్రజలను చైతన్యపరచాలని, వ్యాధినివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదిలా వుండగా సిఎం ఆదేశాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై సిఎంవో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేపడుతోంది...డెంగీ, మలేరియా వ్యాధుల తీవ్రతపై అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi: Chief Minister Chandrababu Naidu held teleconference on dengue and malaria rampant in different districts of the state.CM Chandrababu has ordered the officials to work very seriously in this week. CM Chandrababu told to the officials that they would be suspended at the spot if the situation was not changed by Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more