కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ కు సమాచారం అందించారు . ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారని, ఆస్పత్రుల్లో ఎక్కాడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు .

ఇక కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సగటు 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే దేశంలో మరణాల రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే ఏపీలో 2.46 శాతం అని వెల్లడించారు. ఇక ఈ కేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయని స్పష్టం చేశారు.

CM Jagan Review on Corona Control ...AP First Place in Tests

ఇక సీఎం జగన్ వైద్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు . ల్యాబ్ లు పెంచమని చెప్పిన జగన్ ఆ విషయంపై ఆరా తీశారు. ఇక పెరుగుతున్న కేసుల నేపధ్యంలో శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్‌లు సిద్ధం అవుతున్నాయని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుపై కూడా దృష్టిపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు.

Recommended Video

    Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+