రోడ్డెక్కిన కండోమ్ లు..అసలు కథ చెప్పిన వర్షం.. వీడియో వైరల్!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గుంటూరులో వర్షాలతో కొత్త ఇబ్బంది
ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి వరద నీరు చేరుకుని జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. అయితే గుంటూరులో ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారికి మరో కొత్త ఇబ్బంది కూడా ఎదురయింది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంటూరులో రహదారులపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Condoms on the roads in Guntur arandalpet due to heavy rains video viral

అరండల్ పేట రోడ్లపై కండోమ్ లు
అయితే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే గుంటూరు అరండల్ పేటలో రోడ్లపైకి కండోమ్ లు చేరడం ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే అరండల్ పేట రోడ్డు మీద ఒక్కసారిగా కండోమ్ లు చూసిన ప్రజలు చీదరించుకుంటున్నారు. వర్షం నీటితో పాటు కొట్టుకొని రోడ్డు మీదకు వచ్చిన కండోమ్ లను చూసి జనాలు షాక్ కు గురవుతున్నారు.

రోడ్లపైన కనిపిస్తున్న కండోమ్ లతో తీవ్ర చిరాకు
అరండల్ పేట లోని ఒక లాడ్జి ముందు రోడ్డుపైకి కొట్టుకు వచ్చిన వీటిని దాటుకుంటూ ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మండపాలను సందర్శించే భక్తులకు రోడ్ల పైన కనిపిస్తున్న కండోమ్ లు తీవ్ర చిరాకును కలిగిస్తున్నాయి.

ఆ లాడ్జిలో ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు?
ఇక ఈ కండోమ్లను చూసిన వారంతా ఆ లాడ్జిలో ఏం జరుగుతుంది అని చర్చిస్తున్నారు. గుంటూరు నడి సెంటర్లో ఇంతా జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత లాడ్జి నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపైకి వచ్చిన కండోమ్ ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లాడ్జిలో ఏం జరుగుతుందో వర్షం అందరికీ అర్ధమయ్యేలా చెప్పింది. మరి ఇప్పటికైనా ఆ లాద్జిపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+