Cyclone Michaung: వరద బాధితులకు సినీ హీరోలు సూర్య, కార్తీ సాయం!!
మిచౌంగ్ తుపాను తమిళ నాడు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది. మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నై అల్లకల్లోలంగా మారింది. తమిళనాడు రాజధానిలో చెన్నైలో ఇప్పటికే 8మంది మరణించారు. తుఫాన్ కారణంగా చెన్నై దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తుఫాను కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, ప్రస్తుతం అక్కడ విధ్వంసకర వాతావరణం కనిపిస్తోంది.
చెన్నై వీధుల్లో మొసళ్ళు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. చెన్నైలోని అనేక ప్రాంతాలలో చెట్లు నేల కూలగా , అనేక ప్రాంతాలలో అంధకారం అలముకుంది. అక్కడ వరద బాధితులకు సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, తన తమ్ముడు కార్తీలు తమ వంతుగా సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

ప్రస్తుతం తమిళనాడు భారీ వర్షాలతో అక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడంతో సూర్య బ్రదర్స్ బాధితులకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. బాధితులకు ఆహార వసతి కల్పించడానికి సూర్య తన సోదరుడు కార్తీ ఇద్దరు 10 లక్షల రూపాయల సహాయం అందించారని చెబుతున్నారు. ఇప్పటికే సూర్య అనేక సేవా కార్యక్రమాలను చేయడంతో పాటు, అవసరమైన వారికి తగిన సమయంలో తన వంతుగా సహాయం అందిస్తూనే ఉన్నారు.
తుఫాన్ ప్రభావంతో చెన్నైలో టీ నగర్, రంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ టెంపుల్ చెరువు, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి ప్రాంతాలలో ఇళ్ళలోకి వరదనీరు చేరుతుంది. చెన్నైలో పరిస్థితుల నేపధ్యంలో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను అందిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో వరదనీరు భారీగా చేరుకుంది. దీంతో విమానాశ్రయం మూతపడగా, నేడు తిరిగి తెరుచుకుంది. అయినప్పటికీ పలు విమాన యాన సంస్థలు తమ సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. మొత్తంగా తమిళనాట బీభత్సం సృష్టించిన తుఫాను దెబ్బకు జనజీవనం విలవిలలాడుతుంది.
-
ఏపీలో ఆ జిల్లాల్లో పెనం మీద ఉన్నట్టే- అత్యధిక ఉష్ణోగ్రత -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications