విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌కు చెంచాగిరి చేస్తున్నా, టిక్కెట్ ఇవ్వకున్నా..: దేవినేని అవినాశ్

టిడిపి నేత దేవినేని అవినాశ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్‌కు చెమ్చాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. తప్పకుండా, చేస్తున్నానని, చంద్రబాబు తర్వాత తమ లీడర్ లోకేషేనని వ్యా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి నేత దేవినేని అవినాశ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్‌కు చెమ్చాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. తప్పకుండా, చేస్తున్నానని, చంద్రబాబు తర్వాత తమ లీడర్ లోకేషేనని వ్యాఖ్యానించారు.

నారా లోకేష్‌ను దగ్గరుండి చూసిన వ్యక్తిని, ఆయనకు ఉన్న విజన్, ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి గానీ, మరెవ్వరికీ లేదని అవినాశ్ అన్నారు. రాష్ట్రాన్ని, ఈ పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి కార్యకర్తకు ఏ విధంగా అండగా ఉండాలనే లక్ష్యం ఉన్న నాయకుడన్నారు.

చెంచాగిరి చేస్తాం

చెంచాగిరి చేస్తాం

అలాంటి నాయకుడికి మేం తోడుగా ఉంటామని, అలాంటి నాయకుడికి చెంచాగిరి చేస్తామని, ఆయనతోనే ఉంటామని, పోరాటం చేస్తామని, చెప్పింది చేస్తామన్నారు.

టిక్కెట్ రాకపోయినా పని చేస్తా

టిక్కెట్ రాకపోయినా పని చేస్తా

వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున తనకు టిక్కెట్ రాకపోయినా పార్టీ కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కోసం పని చేస్తానన్నారు. తాము టిడిపిలో చేరేటప్పుడే ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు.

కలిపేసేందుకు సిద్ధం

కలిపేసేందుకు సిద్ధం

పార్టీ కోసం పని చేస్తామని, పదవులు అడిగే మనస్తత్వం తమది కాదని చెప్పారు. తెలుగు విద్యార్థి సంఘంలో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ను కలిపేందుకు సిద్ధమని చెప్పారు.

వంగవీటి సినిమాపై..

వంగవీటి సినిమాపై..

వంగవీటి చిత్రం సినిమా విషయమై మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వ్యవహారంలో తాము తలదూర్చలేదని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తమ ఇంటికి వస్తామంటే సరేనని చెప్పామని, భోజనం పెట్టి పంపించామన్నారు. అంతేకానీ వంగవీటి కథ ఇలా ఉండాలని చెప్పలేదన్నారు.

English summary
Telugudesam Party leader Devineni Avinash interesting comments on Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X