వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్కెట్‌పై బాధలేదు: డొక్కా, షర్మిల వద్దన్నారు: వాసిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dokka not unhappy with Congress
హైదరాబాద్: తనకు పార్టీ టిక్కెట్ కేటాయించనందుకు ఎలాంటి అసంతృప్తి లేదని, తాను పార్టీని వీడనని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సోమవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ అదివారం ప్రకటించిన తొలి జాబితాలో డొక్కా పేరు లేదు. దీనిపై ఆయన స్పందించారు.

పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వనందుకు తానేం బాధపడటం లేదన్నారు. పార్టీని విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నారు. దళితులకు, మాల, మాదిగలకు సమ ప్రాధాన్యం ఉండాలన్నారు. రెండు వర్గాలకు సమన్వయకర్తగా తాను ఉంటానని ఆయన చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు.

దాడులు సరికాదు

పార్టీ కార్యాలయాల పైన దాడులు సరికాదని పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. పోటీ కోసం 1200 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కేడర్ సేవలను తాము పూర్తిగా వినియోగించుకుంటామన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస రావుకు పార్టీ టిక్కెట్ ఇచ్చిందని... బిజెపిలోకి వెళ్లడం ఆయన ఇష్టమన్నారు.

షర్మిల వద్దన్నారు: వాసిరెడ్డి

షర్మిల, కొణతాల రామకృష్ణలకు టిక్కెట్ దక్కక పోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పందించారు. షర్మిల, కొణతాలలు పోటీ చేయమని చెప్పారన్నారు. మొదటి నుండి అనుకున్న వారికే టిక్కెట్లు ఇచ్చామన్నారు. టిక్కెట్ల కేటాయింపుపై ఎలాంటి అసమ్మతి ఉండదన్నారు. త్వరలో మిగిలిన వారిని ప్రకటిస్తామన్నారు.

కాగా, అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపందించారని వైయస్ విజయమ్మ చెప్పారు. సోమవారం ఉదయం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మేనిఫెస్టోను విజయలక్ష్మి విడుదల చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైయస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

English summary
Former Minister Dokka Manikya Vara Prasad is not unhappy with Congress High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X