లొంగిపోతాను, నేను యజమానిని కాదు: బోట్ ప్రమాదంపై ఏడుకొండలు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ ఫెర్రీ ఘటనలో నిందితుడు ఏడుకొండలు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బోటు ఆయన పేరు మీదనే ఉంది. దీనిపై ఆయన స్పందించారు.

  Krishna river boat capsized : సింగపూర్‌ టూరిజం కాదు, సేఫ్టీ టూరిజం కావాలి | Oneindia Telugu

  తాను రివర్ బోటింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టలేదని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అసలు ఆ బోటు వెళ్లేదాకా తనకు తెలియదని చెప్పారు.

   అసలు యజమానిని నేను కాదు

  అసలు యజమానిని నేను కాదు

  తనపై ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఏడుకొండలు చెప్పారు. తన పేరు వాడుకొని తన స్నేహితులు బోటు నడుపుతున్నారని వాపోయారు. బోటు రిజిస్ట్రేషన్ తన పేరు మీదనే ఉందని చెప్పారు. కానీ అసలు యజమానిని తాను కాదన్నారు.

   నా పేరు ఉపయోగించుకున్నారు

  నా పేరు ఉపయోగించుకున్నారు

  తన పేరు ఉపయోగించుకొని తన స్నేహితులు బోటును నడుపుతున్నారని ఏడుకొండలు చెప్పారు. బోటు రిజిస్ట్రేషన్ తన పేరు మీదే ఉన్నప్పటికీ అసలు యజమాని గేదెల శ్రీనివాస్ అని చెప్పారు. అతను తన స్నేహితుడు అన్నారు. తనకు ఈ వ్యాపారంలో అనుభవం లేదని, తన స్నేహితులకు ఉందని చెప్పారు. కాబట్టి తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదన్నారు.

   కమిషనర్ ఎదుట లొంగిపోతా

  కమిషనర్ ఎదుట లొంగిపోతా

  ఇప్పటికే తాను ఆర్థికంగా చితికిపోయానని ఏడుకొండలు చెప్పారు. తనకు తెలియకుండానే బోటును తీసుకెళ్లారన్నారు. తాను స్థానికంగా ఉంటానని తన పేరును ఉపయోగించుకున్నారని చెప్పారు. ఈ దుర్ఘటన అనుకోకుండా జరిగిందని వాపోయారు. నేను కమిషనర్ ఎదుట లొంగిపోతానని చెప్పారు.

   యజమానులపై కేసు

  యజమానులపై కేసు

  కాగా, ప్రమాదానికి కారణమైన రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలిసి కూడా మరణానికి కారణమయ్యారని ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌ 2 కింద ఇబ్రహీంపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు పెట్టారు. అనుమతి లేకుండా పడవను నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను తీసుకెళ్లడాన్ని నేరంగా పరిగణించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కనీసం లైఫ్‌ జాకెట్టు కూడా లేకుండా, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని ఈ దుర్ఘటనకు కారకులయ్యారన్న అభియోగాలను నమోదు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A case has been registered against two persons after a boat capsized that occurred mid-sea off Manapadu beach here in which nine persons got drowned.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి