• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి డిజిపికి ఎన్నిక‌ల సంఘం పిలుపు : వివ‌ర‌ణ కోర‌నున్న ఇసి అధికారులు : వైసిపి ఫిర్యాదుల ఎఫెక్ట్‌..!

|

రెండు రోజుల క్రితం ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వివ‌ర‌ణ కోరిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం..ఇప్పుడు ఏపి డిజిపికి స‌మ న్లు జారీ చేసింది. ఈ రోజు త‌మ వ‌ద్ద హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే డిజిపి తో పాటుగా ఏపి పోలీసు అధికారుల పై వ‌స్తున్న ఫిర్యాదుల పై వివ‌ర‌ణ తీసుకోనుంది. సంతృప్తి క‌ర స‌మాధానం ఇస్తే సూచ‌న‌లు..లేకుంటే కొందరి అధికారుల పై చ‌ర్య‌ల‌కు సిఫార్సు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది..

<strong>ఏపిలో పెద్ద కుట్ర : ఆ ముగ్గురు క‌లిసి ప్లాన్ : చ‌ంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌..!</strong>ఏపిలో పెద్ద కుట్ర : ఆ ముగ్గురు క‌లిసి ప్లాన్ : చ‌ంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌..!

డిజిపి కి ఇసి పిలుపు..

డిజిపి కి ఇసి పిలుపు..

ఏపి డిజిపి ఠాకూర్ ను తమ వ‌ద్ద‌కు రావాల్సిందిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ రోజు మ‌ధ్నాహ్నం త‌మ ముందు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నిశితంగా పరిశీలిస్తున్న కేం ద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని పిలిపించి ఏపిలో ప‌రిస్థితుల పై ఆరా తీసారు. నిఘా విభాగాధిప‌తి బ‌దిలీ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం జీవోలు జారీ చేయ‌టం..కోర్టుకు వెళ్ల‌టం పై వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెల‌సింది. ఇక‌, ఇప్పుడు డిజిపి ని పిలిపించిన ఎన్నిక‌ల సంఘం ఏపి లో పోలీసు అధికారులు టిడిపికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఫిర్యాదుల పై స‌మాచారం సేక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యం లో ఇప్ప‌టికే రిలీవ్ చేసిన ఇంట‌లిజెన్స్ అధిప‌తి వెంక‌టేశ్వ‌ర రావు అన‌ధికారికంగా విధులు నిర్వ‌హిస్తున్నార‌నే ఫిర్యాదు పై వివ‌ర‌ణ కోర‌నున్నారు.

డిజిపి పైనా ఫిర్యాదులు..

డిజిపి పైనా ఫిర్యాదులు..

వైసిపి నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం ముందే ఏపిలో డిజిపి ని మార్చాల‌ని కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లి సి ఫిర్యాదు చేసారు. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నాం జ‌రిగిన స‌మ‌యంలో డిజిపి గంటలోనే మీడియా స‌మావేశం ఏర్పాటు చే సి అభిమానే జ‌గ‌న్ పై దాడి చేసార‌ని చెప్ప‌టం పైనా వైసిపి నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ..ఎన్నిక‌ల సంఘానికి చే సిన ఫిర్యాదులో ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. అదే విధంగా డిజిపి స్వ‌యంగా కోట్ల రూపాయాల‌ను అమ‌రావ‌తి నుండి ఒంగోలుకు తీసుకెళ్లార‌ని ఫిర్యాదు చేసారు. ఇక‌, పోలీసు శాఖ‌లో కీల‌క విభాగాల్లో ఉన్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్‌, యోగా నంద్‌, భాస్క‌ర భూష‌ణ్‌, ప్ర‌కాశం ఎస్పీలను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పించాల‌ని వైసిపి నేత‌లు విజ్ఞ‌ప్తి చేసారు. ఈ స‌మ‌యంలోనే ఎన్నిక‌ల సంఘం ఏపికి ప్ర‌త్యేక ప‌రిశీల‌కుడిగా కెకె శ‌ర్మ‌ను పోలీసు వ్య‌వ‌హారాల కోసం నియ‌మించింది. ఇక‌, వీటి పై డిజిపి తో ఎన్నిక‌ల సంఘం చ‌ర్చించి..సూచ‌న‌లు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కీల‌క చ‌ర్య‌లు ఉంటాయా..

కీల‌క చ‌ర్య‌లు ఉంటాయా..

తాము జారీ చేసిన ఆదేశాల విష‌యంలో ఏపి ప్ర‌భుత్వం విరుద్దంగా జీవోలు ఇవ్వ‌టం..కోర్టుకు వెళ్ల‌టం పై ఎన్నిక‌ల సంఘం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఇక కోర్టు తీర్పుతో ఆ ఆంశం ముగిసింది. ఇక‌, తాజాగా ఏబి వెంకటేశ్వ‌ర రావు ఎన్నిక ల విధుల నుండి త‌ప్పించినా..అన‌దికారికంగా విధుల్లో ఉంటున్నార‌ని వైసిపి తాజాగా ఫిర్యాదు చేసింది. దీని పై రాష్ట్ర పోలీసు పరిశీల‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ‌ర్మ నుండి ఎన్నిక‌ల సంఘం నివేదిక కోరింది. ఆయ‌న అంద‌చేసిన నివేదిక పై డిజిపి ని ఎన్నిక‌ల సంఘం వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంది. అయితే, డిజిపి నుండి వివ‌ర‌ణ తీసుకొని సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తారా..లేక చ‌ర్య‌ల దిశ‌గా నిర్ణ‌యాలు ఉంటాయా అనేది ఆసక్తి క‌రంగా మారింది.

English summary
Election commission called AP DGP Thakur to attend before them. In short while DGP attend in CEC. EC may take explanation on YCP complaints against some police officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X