Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో సంక్రాంతికి ఎలక్షన్ సాంగ్స్ రచ్చ; మొన్న జగన్.. నేడు పవన్.. పాటలు రిలీజ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగకు ఏపీలో రాజకీయ పార్టీల హడావిడి, ఎన్నికల సన్నాహాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకపక్క పండుగ వాతావరణంతో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే సంక్రాంతి పండుగకు ఏపీలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సాంగ్ రిలీజ్ చేసి దుమ్ము రేపుతుండగా, మరోవైపు నేడు జనసేన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే పాటను రిలీజ్ చేయనున్నారు.

పరశురాముడు వచ్చినాడురో సూడన్న, ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న .. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న !! అంటూ సాగే జనసేన ఎన్నికల ప్రచార గీతం నేటి ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట విడుదల నేపథ్యంలో జన సైనికులు ఆ పాటను పూర్తిగా వినేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Election Songs hungama in AP on sankranti; Pawan Kalyans election song release today!!

ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రిలీజ్ అయిన కొత్త పాట రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే విపరీతమైన ఆదరణతో దూసుకుపోతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ బన్నీ వాస్ తయారు చేయించిన ఈ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది.

ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో టిడిపి జనసేన కూటమిగా ఎన్నికలకు వెళుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలలో విజయం సాధించేలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఇప్పటి నుండే శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న పవన్ కళ్యాణ్ బన్నీ వాసును జనసేన ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారు.

గత ఎన్నికల సమయంలో రావాలి జగన్ కావాలి జగన్ అంటూ వైసిపి చేసిన పాట దుమ్ము రేపగా ఈసారి ఏ పార్టీకి సంబంధించిన పాట ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తంగా సంక్రాంతి పండుగకు కార్యకర్తలలో జోష్ నింపేలా పాటలు రిలీజ్ చేయటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+