జగన్ కు కేవీపీ లేఖ-కేంద్రం మాట విని ఏపీకి ద్రోహం చేయొద్దు-వైఎస్సార్ కల నెరవేరదంటూ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో కొనసాగిస్తున్న సంబంధాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఓ కీలక ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్ కు కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు.
విజయవాడ : ఏపీ విభజన సందర్భంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కోరిక మేరకు దీని నిర్మాణ బాధ్యత కూడా రాష్ట్రానికే అప్పగించి నిధులిస్తోంది. అయితే ఇప్పుడు నిధుల్లేవన్న కారణంతో ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకోమని కోరుతోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రధానికి తాజాగా లేఖ రాసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇవాళ సీఎం జగన్ కు కూడా లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. ఇవాళ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇందులో ఆయన పొలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవడం బాధగా ఉందన్నారు. నిధులు లేవనే కారణంతో పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచన లో కేంద్రం ఉందని కేవీపీ గుర్తుచేశారు. ఎత్తు తగ్గింపు వల్ల జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు నెరవేరవని కేవీపీ స్పష్టంచేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉన్నందున కేంద్రం ఒత్తిడికి ఒప్పుకోవద్దని సీఎం జగన్ కు కేవీపీ సూచించారు.ఈ విషయంలో రాజీ పడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్ లెవెల్ 150 అడుగులకు తగ్గకుండా నిర్మాణం చేపట్టి రైతుల ప్రయోజనాలు కాపాడాలని తన లేఖలో కేవీపీ రామచంద్రరావు కోరారు. గతంలో టీడీపీ సహా ఇతర విపక్షాలు పోలవరం ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. అయితే అప్పట్లో సీఎం జగన్ మాత్రం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కానీ తాజాగా నిధుల కొరత, సాంకేతిక కారణాలు, న్యాయవివాదాల్ని సాకుగా చూపి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో కేవీపీ దీనిపై స్పందించి లేఖలు రాస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications