కాకినాడ, నర్సాపూర్, హైదరాబాద్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఇతర కారణాలతో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తూ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. కాకినాడ, నరసాపురం, బెంగళూరు, హైదరాబాద్, మైసూరు వంటి రూట్లలో ఇలా మొత్తం 48 ప్రత్యేక రైళ్లను జనవరి వరకూ పొడిగించారు.
ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు ఇప్పటికే నడుపుతున్న పలు రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇలా పొడిగించిన ప్రత్యేక రైళ్లలో కాకినాడ నుంచి మైసూరుకు ప్రతీ సోమ, శుక్రవారాల్లో నడుపుతున్న 07033 నంబర్ రైలును డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకూ పొడిగించారు. దీంతో మొత్తం 13 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే మైసూరు నుంచి కాకినాడ టౌన్ కు ప్రతీ మంగళ, శనివారాల్లో నడుపుతున్న రైలు నంబర్ 07034 ప్రత్యేక రైలు డిసెంబర్ 2 నుంచి జనవరి 13 వరకూ నడపాలని నిర్ణయించారు. ఇలా మరో 13 సర్వీసులు అందుబాటులో ఉంచారు.

నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07153 ను జనవరి 2 నుంచి 9 వరకూ నడపాలని నిర్ణయించారు. అలాగే బెంగళూరు నుంచి నరసాపురానికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07154ను కూడా జనవరి 3 నుంచి జనవరి 10 వరకూ నడపాలని నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

మరోవైపు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కు ప్రతీ మంగళవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07165 ను డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకూ నడపాలని నిర్ణయించారు. అలాగే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు ప్రతీ బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07166ను డిసెంబర్ 3 నుంచి జనవరి 28 వరకూ నడపాలని నిర్ణయించారు. ఈ లెక్కన 18 సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులు ఈ అప్డేట్ గమనించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications