వైఎస్సార్ ప్రదేశ్ గా ఏపీ- పేరు మార్చాలని జగన్ కు సీబీఐ మాజీ బాస్ వినతి-కోనసీమ హింస వేళ
ఏపీలో జిల్లాల పేరు మార్పు వ్యవహారం రచ్చకు కారణమవుతోంది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చడాన్ని నిరసిస్తూ నిన్న అమలాపురంలో భారీ ఎత్తున హింస చెలరేగింది. దీనివెనుక ఎవరున్నారనే దానిపై ప్రభుత్వం పోలీసులతో ఓవైపు విచారణ చేయిస్తూనే మరోవైపు విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రం పేరే మార్చాలంటూ మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఏపీని వైఎస్సార్ ప్రదేశ్ గా పేరు మార్చాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును "వైయస్సార్ ప్రదేశ్" గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం." అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే
మరో మాట: తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి "YSR Land" అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది. అంటూ నాగేశ్వరరావు మరో విజ్ఞప్తి కూడా చేశారు.

తెలంగాణకు చెందిన నాగేశ్వరరావు గతంలో సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్న నాగేశ్వరరావు ఏపీలో జిల్లాల మార్పుపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి కూడా వైఎస్సార్ ప్రదేశ్ గా పేరు మార్చాలని ఆయన వ్యంగంగా ట్వీట్ చేసినట్లు అర్ధమవుతోంది. తెలుగును ఓ తెగులుగా భావించి పీకి పారేస్తున్నాం అంటూ ప్రస్తావించడం వెనుక వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టినట్లు అర్ధమవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం.🙏
— M. Nageswara Rao IPS(R) (@MNageswarRaoIPS) May 25, 2022
మరో మాట:
తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications