Viral Video: ప్రభుత్వోద్యోగిని విలన్ అనే ముందు..! ప్రవీణ్ ప్రకాష్ 3 ప్రశ్నలు..!
గతంలో వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించి కూటమి పార్టీలకు టార్గెట్ అయిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. ఆ తర్వాత ప్రభుత్వం మారగానే స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి సర్వీసులోకి వస్తానంటూ కూటమి సర్కార్ ను వేడుకోవడం మొదలుపెట్టారు. అంతే కాదు టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లకు ఇంటర్వూలు ఇచ్చి మరీ తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
అయినా కూటమి పార్టీలతో పాటు వైసీపీ కార్యకర్తల నుంచి కూడా సోషల్ మీడియాలో తనపై విమర్శలు కొనసాగుతుండటంపై ప్రవీణ్ ప్రకాష్ ఇవాళ మరోసారి వీడియో విడుదల చేశారు. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా విడుదల చేసిన ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగిని విలన్ అని పిలిచే ముందు మూడు ప్రశ్నలు అంటూ విమర్శకుల్ని టార్గెట్ చేశారు. తన విధినిర్వహణలో భాగంగా చేసిన పనులకు తనను విలన్ అని ఆరోపించడంపై ఆయన ఇందులో వివరణ ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి తాను బయటికి వచ్చిన తర్వాత కూడా ఇవాళ్టికీ తన వాట్సాప్, సోషల్ అకౌంట్లలో విలన్ అంటూ మెసేజ్ లు వస్తూనే ఉన్నాయని ప్రవీణ్ ప్రకాష్ ఈ వీడియోలో తెలిపారు. దేవుడికి అంతా తెలుసన్నారు. తాను ప్రభుత్వంలో ఉండగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, లంచాలు తీసుకోలేదని, జూనియర్లను తప్పుడు పనులు చేయాలని ఇబ్బంది పెట్టలేదని, నిబంధనలకు విరుద్దంగా ఏ పనీ చేయలేదని తెలిపారు. అయినా తనను విలన్ గా ఎందుకు ఆరోపిస్తున్నారో తెలియదన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుుడు నిబంధనలకు విరుద్దంగా స్పందించకూడదని మాట్లాడలేదన్నారు. కానీ ఆ మౌనం అంగీకారమనే కొందరు భావించి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అయినా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి గౌరవం కాపాడేందుకే ఈ రీల్ చేస్తున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ ఏ ప్రభుత్వ ఉద్యోగిని అయినా విలన్ గా ఆరోపించే ముందు అతని వాదన విన్నారా, తప్పు చేయడానికి కారణం ఏమై ఉంటుంది, అలాగే సదరు ఆరోపణకు ఆధారాలు ఉన్నాయా అనే మూడు అంశాలు చూడాలన్నారు. అప్పుడే సమాజంలో పాజిటివ్ వాతావరణం కాపాడగలమన్నారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications