పుష్ప 2.. అల్లు అర్జున్ పై పొగడ్తలు, జగన్ కు క్రెడిట్: మాజీమంత్రి రోజా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్ప 2 సినిమాను వైసిపి నేతలు తెగ మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ ను భుజాల మీద మోస్తున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టగా తాజాగా మాజీ మంత్రి రోజా అల్లు అర్జున్ ను తెగ పొగిడేశారు.

అల్లు అర్జున్ ను పొగిడిన మాజీ మంత్రి రోజా
పుష్ప 2 అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అని అంబటి రాంబాబు అల్లు అర్జున్ అద్భుతమైన యాక్షన్ చేశాడని సోషల్ మీడియా వేదికగా హైప్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా మాజీ మంత్రి రోజా అల్లు అర్జున్ ను ఓ రేంజ్ లో పొగడ్తల వర్షంలో ముంచేశారు. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప టు సినిమా గురించి మాజీమంత్రి రోజా రివ్యూనే రాసేశారు.

Former Minister Roja praised Allu Arjun pushpa 2 movie gave credit to ys jagan over gangamma jatara

సుకుమార్ చిత్తూరు యాసను చిందులేయించారు
ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజా రివ్యూ విషయానికి వస్తే వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు. అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి అని, లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాసను గ్లోబల్ స్క్రీన్ మీద చిందులేయించారన్నారు.

పుష్ప 2 సినిమా గురించి రోజా రివ్యూ
మీతో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్టుని చాలెంజ్గా తీసుకొని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో అంటూ రోజా పోస్ట్ పెట్టారు. అంతేకాదు మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా రేయ్ మచ్చా ఎవడ్రా ఈడు అని మాట్లాడుకునేలా చేశారు అంటూ రోజా పుష్ప 2 సినిమా గురించి తనదైన రివ్యూ రాశారు.

సూపర్ పర్ఫార్మెన్స్ అంటూ రోజా కితాబు
పుష్ప 2 ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నదని , తిరుపతి గంగ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపిందని రోజా గుర్తు చేశారు. గంగ జాతరతో వైఎస్ జగన్ కు రోజా క్రెడిట్ ఇచ్చారు. మీరు మూడు గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారని కొనియాడారు.

సోషల్ మీడియాలో రోజా పోస్ట్ వైరల్
హీరో చీర కట్టుకొని, పసుపు రాసుకొని గంధం పూసుకుని నిమ్మకాయల దండ మెడలో వేసుకొని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయే డాన్స్ చేసిన సీన్లు, స్క్రీన్ పై అద్భుతంగా చూపించారని కొనియాడారు. ఇక రష్మిక సూపర్ అంటూ రష్మిక నటన పైన తన ప్రేమను వ్యక్తం చేశారు. మొత్తంగా పుష్ప సినిమాను ఓ రేంజ్ లో పైకి ఎత్తేసి రోజా రాసిన రివ్యూ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం రోజా ట్వీట్ వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+