• search
 • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆనం వివేకాకు సీఎం నివాళి, జగన్ ఫోన్: అధిష్టానంపై అసంతృప్తి.. కోరిక తీరకుండానే మృతి

By Srinivas
|

నెల్లూరు: ఆనం వివేకానంద రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. చంద్రబాబు గురువారం ఉదయం నెల్లూరుకు చేరుకొని ఆయనకు నివాలులు అర్పించారు. అనంతరం ఆనం కుటుంబాన్ని పరామర్శించారు.

  టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత

  వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఆనం మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆనం వివేకా మరణం రాష్ట్రానికి ముఖ్యంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ప్రజలకు తీరనిలోటు అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. చురుకుగా, చలాకీగా చమత్కారాలతో ఆనం వివేకా మాట్లాడే మాటలు అందరికీ ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయన్నారు.

  టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి, నాడు మంత్రి పదవి వద్దన్న వివేకా

  నాకు సాన్నిహిత్యం ఉంది: వెంకయ్య

  నాకు సాన్నిహిత్యం ఉంది: వెంకయ్య

  ఆనం వివేకానంద కుటుంబసభ్యులతో తనకు సానిహిత్యం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని బుధవారం ఇచ్చిన ఓ ప్రకటనలో వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆనం వివేకా మృతిపై బుధవారం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం ఆయన వివేక సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు.

  ఆనం కుటుంబం నా తల్లిని ఆడపడుచుగా భావిస్తుంది

  ఆనం కుటుంబం నా తల్లిని ఆడపడుచుగా భావిస్తుంది

  ఆనం వివేకా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులకు జగన్ బుధవారం సానుభూతి తెలిపారు. తన తల్లిని ఆనం కుటుంబం వారి ఆడపడచుగా భావిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  వివేకా మృతి నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి అన్నారు.

  కొంతకాలంగా అనారోగ్యం

  కొంతకాలంగా అనారోగ్యం

  ఆనం వివేకానంద కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు తుదిశ్వాస విడిచారు. 1950 డిసెంబరు 23న జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు. సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఏడాదిగా వివేకా వీర్యగ్రంథి కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబ సభ్యులు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.

  రెండు మూడు రోజులుగా క్షీణించిన ఆరోగ్యం

  రెండు మూడు రోజులుగా క్షీణించిన ఆరోగ్యం

  గత రెండు, మూడు రోజులుగా ఆనం వివేకానంద ఆరోగ్యం ఎక్కువగా క్షీణించింది. నెల్లూరు వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1999, 2004లో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి, 2009లో గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విభజన నేపథ్యంలో ఆ తర్వాత ఆనం సోదరులు టీడీపీలో చేరారు.

  ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవిలు అంటే ఇష్టం

  ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవిలు అంటే ఇష్టం

  ఆనం వివేకా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. తొలుత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహ రావులతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తన రాజకీయ గురువు అని చెప్పేవారు. ఆనం వివేకాకు సినిమాలు అంటే ఇష్టం. ఆటలు అన్నా ఇష్టమే. ఆయనకు ఎన్టీఆర్, కృష్ణలు అంటే ఇష్టం. ఆ తర్వాత తరంలో చిరంజీవి సినిమాలు బాగా ఇష్టపడ్డారు. రోజుకో సినిమా, అదీ సెకండ్ షో చూడటం ఇష్టం.

  ఆనం వివేకా అసంతృప్తి

  ఆనం వివేకా అసంతృప్తి

  విభజన నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో వారు 2016లో టీడీపీలో చేరారు. అయితే తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని ఆనం వివేకా అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూశారు. చివరకు గవర్నర్ కోటాలో ఇస్తారని భావించారు. కానీ అదీ దక్కలేదు. ఎమ్మెల్సీగా ఉండాలన్న ఆయన కోరిక తీరకుండానే మృతి చెందారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former MLA and senior leader Anam Vivekananda Reddy passed away aged 67 following a prolonged illness, at a super speciality hospital in Hyderabad on Wednesday morning.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more