మొన్న ప్రియుడు: నమస్కరిస్తూ రైలుకు ఎదురుగా వెళ్లి ఆమె మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ప్రేమ జంట ఒకరి తర్వాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారంనాడు ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, ప్రియురాలు సోమవారం మధ్యాహ్నం అదే రీతిలో బలవన్మరణానికి పాల్పడింది.

రెండు చేతులూ మీదికి వస్తున్న రైలుకు అమ్మాయి నమస్కరిస్తూ దాని కింద పడి మరణించింది. సహచర విద్యార్థులంతా చూసే సరికి ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఇలా చేసింది..

ఇలా చేసింది..

తిరుపతి, రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణ తేజ విద్యాసంస్థల ఎదురుగా సోమవారం మధ్యాహ్నంం హేమలత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంస్థలోనే ఆమె డిఫార్మసీ ఫైనలియర్ చుదువుతోంది. ఆమె స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట.

ప్రేమిస్తున్నానంటూ అతను

ప్రేమిస్తున్నానంటూ అతను


హేమలత తండ్రి సూళ్లూరుపేటలో రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు. తాను ప్రేమిస్తున్నానంటూ అదే శాఖలో పనిచేస్తున్న మరో ఉద్యోగి కుారుడు నరేద్ర హేమలత వెంట పడ్డాడు. ఇతను చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

మరొకరితో పెళ్లి ఖరారు..

మరొకరితో పెళ్లి ఖరారు..

నరేంద్ర వ్యవహారం హేమలత తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో హేమలతకు మరో యువకుడితో పెళ్లి ఖరారు చేశారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. శుక్రవారంనాడు నరేంద్ర ఫోన్ చేసి హేమలతతో మాట్లాడాడు. తన ప్రేమను అంగీకరించకపోతే చచ్చిపోతానని చెప్పాడు ఫోన్‌లో మాట్లాడుతూనే అతను ఎదురుగా వస్తున్న రైలు కింద పడి మరణించాడు.

ఆ సంఘటన కలచివేసింది...

ఆ సంఘటన కలచివేసింది...

నరేంద్ర బలవన్మరణం హేమలతను తీవ్రంగా కలచివేసింది. సోమవారంనాడు ఆమె సరిగ్గా నరేంద్ర చనిపోయిన రీతిలోనే తమ కాలేజీ సమీపంలోని రైలుకు ఎదురుగా నిలబడి మరణించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lovers commit suicide near Renigunta of Chittoor district in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి