Godavari Express: అది రైలు కాదు 52 ఏళ్ల ఎమోషన్- రైల్వే అరుదైన అవార్డు..!
ప్రపంచంలోనే భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని కలిగిన రెండో ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వేలు కొన్నేళ్లుగా ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మారిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం కూడా రైల్వేల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇందులో నుంచి పుట్టుకొచ్చినవే వందేభారత్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లు. అయితే ఎన్ని రైళ్లు వచ్చినా ఇంకా అర్ధ శతాబ్దంగా రాకపోకలు సాగిస్తున్న అరుదైన రైళ్లు ఎన్నో ఉన్నాయి.
వీటిలో తెలుగు రాష్ట్రాల మధ్య గత 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ (godavari express) కూడా ఒకటి. హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నిరంతరాయంగా ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తున్న ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంది. అలాగే ప్రస్తుతం రైల్వే అత్యుత్తమంగా నిర్వహిస్తున్న రైళ్లలో ఇది కూడా ఒకటి. ప్రీమియం రైలు కాకపోయినా మెయింటెనెన్స్, రాకపోకల సమయాల నిబద్ధత వంటి అంశాల్లో గోదావరి ఎక్స్ ప్రెస్ కు మంచి పేరుంది. వీటి కారణంగా రైల్వే ఈ రైలుకు అరుదైన అవార్డు ఇచ్చింది.

52 Years. One Legend. Infinite Memories. 🚆
— South Central Railway (@SCRailwayIndia) February 2, 2026
Celebrated the iconic T. No.12728 Hyderabad → Visakhapatnam #Godavariexpress, More than a train, an emotion since 1974. 2025 SCR's Best Maintained Train Award 🛡️🏆#Celebrations #IndianRailways pic.twitter.com/sKmfm2mQvK
దక్షిణ మధ్య రైల్వే తాజాగా గోదావరి ఎక్స్ ప్రెస్ కు అత్యుత్తమంగా నిర్వహిస్తున్న రైలు (best maintained train) అవార్డు ప్రకటించింది. 1974 నుంచి ఇప్పటివరకూ నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు కేవలం రైలు మాత్రమే కాదని ఓ ఎమోషన్ అంటూ దక్షిణమధ్య రైల్వే ఇవాళ ఓ ట్వీట్ చేసింది. ఇందులో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఫొటోలతో పాటు దానికి ప్రకటించిన అవార్డు ఫొటోల్ని కూడా ప్రయాణికులతో పంచుకుంది. ఇది చూసిన ప్రయాణికులు గోదావరి ఎక్స్ ప్రెస్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications