డ్వాక్రా మహిళలకు శుభవార్త... "ఈ నారీ" లుగా టెక్నాలజీలోనూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో డ్వాక్రా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుని వారికి శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడానికి రెడీ అయింది. గ్రూపులోని మహిళలకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది.

డ్వాక్రా మహిళలకు కొత్త కార్యక్రమం "ఈ నారీ"
డ్వాక్రా గ్రూపులలో పనిచేస్తూ యాక్టివ్ గా ఉండే మహిళలను ఎంపిక చేసి వారికి ఈ నారీ లుగా శిక్షణ ఇవ్వనుంది. ఆపై వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించనుంది. ప్రస్తుతం సంఘాల వారీగా సీసీలు, ఏపీఎంలు మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక పూర్తి అయిన తర్వాత సిఆర్పి లతో కలిసి వారికి శిక్షణ ఇస్తారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలు ఆధునిక సాంకేతికతను నేర్చుకుని తద్వారా ఉపాధిని పొందడానికి వీలవుతుంది.

good news to dwcra women in ap e-Nari posts to them

ఈ నారీలుగా ఎంపికైన వారు చెయ్యాల్సింది ఇదే
ఈ నారీలు గా ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో వారు తమ సంఘాల కార్యకలాపాలను సులభంగా చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రస్తుతం వివరాలను సేకరిస్తున్న క్రమంలో ఎవరిని "ఈ నారీ"లు గా ఎంపిక చేయాలో నిర్ణయిస్తారు. ఎంపిక పూర్తి అయిన తర్వాత వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో వీరితోపాటు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు కూడా పాల్గొంటారు. వారు విరికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు.

వీరికే ఈ నారీలుగా అవకాశం
ఏపీలోని గ్రామాలలో ప్రతి పది మహిళా సంఘాలకు ఒక ఈ నారీని నియమిస్తారు. 25 సంఘాలు ఉన్న గ్రామాలలో ముగ్గురు వరకు అంతకంటే ఎక్కువ ఉంటే మరో ఇద్దరిని నియమించే అవకాశం ఉంది. ఇక ఎంపికలో ఎక్కువ చదువుకున్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు. వారి వయసు 18 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యతను ఇస్తారు.

ఈ నారీలు చెయ్యాల్సింది ఇదే!
డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసే ఈ నారీలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం, నెలవారి వాయిదాలను సకాలంలో చెల్లించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆర్థిక విషయాల పైన అవగాహన కల్పించడంతోపాటు, మహిళల జీవనోపాధికి మార్గాలను చూపిస్తారు. మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తారు. ఏదిఏమైనా డ్వాక్రా మహిళలకు సంతోషం కలిగించేలా వారి ఉపాధిని పెంచేలా మరి మరి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+