కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపికి గౌరు దంప‌తుల గుడ్ బై : జ‌గ‌న్ చెప్పింది ఇదే : వైసిపికి న‌ష్ట‌మేనా.!

|
Google Oneindia TeluguNews

క‌ర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంప‌తులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయ‌స్ విధేయులుగా ఉన్న గౌరు దంప‌తులు..జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు త‌రువాత ఆయ‌న తో న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలి చిన గైరు చ‌రిత‌..ఇప్పుడు ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేసారు. ఈ నెల 9న టిడిపి లో చేరునున్నారు. గౌరు దంప‌తు లు వైసిపిని వీడ‌టం..ఇప్పుడు ఆ జిల్లా లో పార్టీ పై ఎటువంటి ప్ర‌భావం ప‌డుతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

జ‌గ‌న్ చెప్పింది ఇదే..

జ‌గ‌న్ చెప్పింది ఇదే..

2014 ఎన్నిక‌ల్లో గౌరు చ‌రిత‌కు వైసిపి పాణ్యం నుండి టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రంగా పోటీ చేసిన కాట‌సాని రాం భూపాల్ రెడ్డి పై గౌరు చ‌ర‌త గెలుపొందారు. ఆ త‌రువాత గౌరు వెంక‌ట‌రెడ్డికి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎ న్నిక‌ల్లో గౌరు వెంక‌ట‌రెడ్డికి ఎమ్మెల్సీగా బ‌రిలోకి దించారు. ఆ ఎన్నిక‌ల్లో వెంక‌ట‌రెడ్డి ఓడిపోయారు. ఇక‌, బిజెపి లో ఉన్న కాట‌సాని వైసిపి లో చేరారు. ఆయ‌న‌కు అక్క‌డ ఉన్న బ‌లం కార‌ణంగా ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇస్తున్నామ‌ని..గౌరు దంప తుల్లో ఒక‌రికి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే, తాము ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోనే పోటీ చేస్తా మ‌ని గౌరు దంప‌తులు తేల్చి చెప్పారు. తాము ఒక సారి ప్ర‌జ‌ల‌కు దూర‌మైతే తిరిగి ద‌గ్గ‌ర కాలేమ‌ని..తాము తొలి నుండి జ‌గ‌న్ ను న‌మ్ముకొని ఉన్నామ‌ని..మ‌ధ్య‌లో వ‌చ్చిన వారికి టిక్కెట్ ఇస్తున్నార‌ని గౌరు దంప‌తులు చెబుతున్నారు.

వైసిపి కి న‌ష్ట‌మేనా..

వైసిపి కి న‌ష్ట‌మేనా..

గౌరు దంపతులు వైసిపికి రాజీనామా చేయ‌టం..టిడిపి లో చేరాల‌ని నిర్ణ‌యించ‌టం తో ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో ఈ నిర్ణ‌యం ఎంత మేర ప్ర‌భావం ప‌డుతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. గౌరు దంప‌తులు పాణ్యం తో పాటుగా నందికొట్కూరు , క‌ర్నూలు టౌన్‌ లో కొంత భాగం ప్ర‌భావం చేయ‌గ‌ల‌రు. అయితే, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి కి వ్య‌క్తిగ‌తంగా ఉన్న ఇమే జ్ పార్టీకి పాణ్యం లో దోహ‌దం చేస్తుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో గౌరు బావ‌కు టిడిపి నంద్యాల ఎంపి టిక్కెట్ ఇస్తుంద‌నే ప్ర‌చారంతో..ఆయ‌న ఒత్తిడి మేర‌కు గౌరు దంప‌తులు పార్టీ వీడుతున్నార‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. గౌరు దంప‌తులు సైతం జ‌గ‌న్ తో విబేధాలు లేవ‌ని..టిక్కెట్ ఇవ్వ‌ని కార‌ణంగానే తాము పార్టీ వీడుతున్నామ‌ని చెప్ప‌టం ద్వారా..పెద్ద‌గా న‌ష్టం ఉండ‌ద‌ని వైసిపి నేత‌లు లెక్క‌లు వేస్తున్నారు. అయితే, కోట్ల‌- గౌరు కుటుంబాల తో కెఇ వ‌ర్గం క‌లిసి ప‌ని చేస్తే..డోన్, నందికొట్కూరు, క‌ర్నూలు టౌన్ లో గ‌ట్టి ఫైట్ ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా.

9న టిడిపి లోకి..

9న టిడిపి లోకి..

గౌరు దంప‌తులు ఈ రోజు క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న ముఖ్య‌మంత్రితో స‌మావేశం కానున్నారు. ఆయ‌న పాణ్యం సీటు పై హామీ ఇస్తే..తాము ఈ నెల 9న టిడిపి లో చేరుతామ‌ని గౌరు దంప‌తులు స్ప‌ష్టం చేసారు. అయితే, టిడిపి నుండి అక్క‌డ ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు గౌరు దంప‌తుల‌కు చంద్ర‌బాబు సీటు ఖ‌రారు చేస్తే ఏరాసు ఎటుంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఇదే స‌మయంలో ఇప్ప‌టికే గౌరు దంప‌తులు కోట్ల కుటుంబం తోనూ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల వేళ‌..జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలు టిడ‌విపి - వైసిపి మీద ఏ మేర ప్ర‌భావం చూపుతాయో చూడాలి.

English summary
Senior YCP leaders Gowru couple resigned party and decided to join in TDP. Today they meet Chandra Babu in Kodumuru. ON 9th of this month they joining in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X