ఇంద్రకీలాద్రిపై దసరాకు భారీ ఏర్పాట్లు-10 లక్షల మంది రాక అంచనా- వివరాలివే..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దర్శించుకునేందుకు ఈసారి భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. దసరా ఏర్పాట్లపై ఇవాళ నిర్వహించిన సమన్వయకమిటీ భేటీ తర్వాత దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఈ వివరాలు వెల్లడించారు.

దసరాలో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. కోఆర్డినేషన్ కమిటి మీటింగ్ లో అన్ని సూచనలు పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామన్నారు. చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఇంద్రకీలాద్రిపై లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. 21 లక్షల ప్రసాదాలు సిద్దం చేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులకు ఈసారి మరిన్ని రెస్ట్ షెడ్స్ & వాష్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.

grand arrangements for dussehra on vijayawada indrakeeladri-10 lakh devotees expected

ఈసారి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత ,రూ.100, రూ.300 క్యూ లైన్స్ తో పాటు వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులు ఎక్కడా ఆగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో 300 షవర్స్ ఏర్పాటు చేస్తే ఈసారి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. ఈ ఏడాది అన్నదానం నిర్వహించడంలేదని, భక్తులకు భోజన ప్యాకెట్స్ అందజేస్తున్నామన్నారు. అలాగే అంతరాలయం దర్శనం కూడా లేదన్నారు. ఈసారి 250 మంది శానిటేషన్ సిబ్బందితో శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో భ్రమరాంబ తెలిపారు. తెల్లవారు జాము 3గం.ల నుండి రాత్రి 10.30 వరకు అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. తొలిరోజు అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం ఉ.9 నుండి భక్తులను అనుమతిస్తామన్నారు. ఖడ్గమాల అర్చన అంతరాలయంలో కాకుండా 6వ అంతస్తులో నిర్వహించబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+